Twitter Shopping: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ త్వరలో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఇక నుంచి ట్వీట్లే కాదు..షాపింగ్ కూడా చేసుకునే అవకాశం లభించనుంది యూజర్లకు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచంలోని మైక్రో బ్లాగింగ్ వేదికల్లో అగ్రస్థానంలో ఉన్న ట్విట్టర్ త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది. ప్రొడక్ట్ డ్రాప్స్ పేరుతో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులో వస్తే యూజర్లకు ట్వీట్లతో పాటు షాపింగ్ చేసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది. మార్కెట్‌లో ప్రవేశించే వస్తువులను అమ్మకానికి ముందే వినియోగదారులకు కనపడేలా ప్రకటనలు వస్తాయి. విడుదలకు ముందే సైన్ అప్ చేసుకుంటే నోటఫికేషన్లు అందుతాయి. అంటే ప్రొడక్ట్ డ్రాప్స్ ఫీచర్‌లో అప్‌కమింగ్ లాంచ్ గురించి సంబంధిత వ్యాపారి ట్వీట్ చేసినప్పుడు..రిమైండ్ మి బటన్ మీకు కన్పిస్తుంది.
రిమైండ్ మి బటన్ నొక్కితే..ఆ ప్రొడక్ట్ లాంచ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేరుగా షాప్ ఆన్ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ మీకు కావల్సిన వస్తువులు షాపింగ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ యూజర్లకు ప్రత్యేక ఆఫర్ కూడా ఉంటుంది.
Also read: Post Office FD Plans: బ్యాంకుల కంటే ఆకర్షణీయంగా.. పోస్టాఫీసు ఎఫ్‌డి స్కీమ్స్, వాటి ప్రయోజనాలు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook