Train Ticket Concession: 2024 బడ్జెట్ ఫిబ్రవరి 1న ఉంది. ఈసారి బడ్జెట్‌పై కొన్ని అంచనాలున్నాయి. ముఖ్యంగా రైల్వే శాఖ గతంలో సీనియర్ల సిటిజన్లకు ఇచ్చిన టికెట్ రాయితీ మరోసారి అందించే అవకాశాలున్నాయి. రానున్న సాధారణ బడ్దెట్‌లో ఈ మేరకు ప్రస్తావన ఉండవచ్చని తెలుస్తోంది.
ఈసారి వచ్చేది ఎన్నికల బడ్జెట్. 2024లో ఎన్నికలకు కొద్దిగా ముందు వచ్చే బడ్జెట్ కావడంంతో కచ్చితంగా ప్రజాకర్షకంగా ఉండనుంది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు టికెట్‌పై 33 శాతం రాయితీ ఉండేది. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని రకాల రాయితీలను రైల్వే శాఖ తొలగించేసింది. కరోనా నుంచి కోలుకుని సాధారణ పరిస్థితులు నెలకొన్న ఆ రాయతిని మాత్రం కేంద్ర ప్రభుత్వ ఇంకా కొనసాగించలేదు. ఇప్పుడు రానున్న బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీపై నిర్ణయం తీసుకకోవచ్చని సమాచారం. 2019 వరకూ ఐఆర్సీటీసీ 60 ఏళ్లు దాటిన ప్రయాణికులకు, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ రాయితీ కల్పించేది. ఈ రాయితీ అనేది దురంతో, శతాబ్ది, జన శతాబ్ది, రాజధాని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్తించేది.
పురుషులు 60 ఏళ్లు దాటితే 40 శాతం డిస్కౌంట్, మహిళలకు 58 ఏళ్లు దాటితే 50 శాతం డిస్కౌంట్ లభించేది. కరోనా మహమ్మారి సమయంలో ఈ డిస్కౌంట్ తొలగించినప్పటి నుంచి తిరిగి రాయితీ ఇవ్వాలనే వినతులు పెరుగుుతూ వస్తున్నాయి. ఇప్పుడు 2024 బడ్జెట్ సమీపిస్తుండటంతో గతంలో ఇచ్చిన టికెట్ రాయితీని మరోసారి ఇవ్వాలని సీనియర్ సిటిజన్లు కోరుకుంటున్నారు.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను 20024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కొన్ని వర్గాలపై రాయితీల వర్షం కురవవచ్చని తెలుస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేయవచ్చని అంచనా ఉంది. సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన టికెట్ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also read: UIDAI New Rules: ఆధార్ కార్డు ఇకపై పుట్టిన తేదీ ప్రూఫ్‌గా పనిచేయదు, యూఐడీఏఐ కొత్త నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook