CIBIL Score Is Falling Down: సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినప్పటికీ సిబిల్ స్కోర్ తగ్గుతోంది ఎందుకు ?

Why Mm CIBIL Score Is Falling Down: క్రెడిట్ కార్డ్స్ వినియోగం విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ఇంకొంతమంది సరైన అవగాహన లేకపోవడంతో తమకు తెలిసిన విషయాలే కరెక్ట్ అనుకుని అవే ఫాలో అవుతూ తమకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల బారిన పడుతుంటారు.

Written by - Pavan | Last Updated : Sep 22, 2023, 11:19 PM IST
CIBIL Score Is Falling Down: సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినప్పటికీ సిబిల్ స్కోర్ తగ్గుతోంది ఎందుకు ?

Why My CIBIL Score Is Falling Down: క్రెడిట్ కార్డ్స్ వినియోగం విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ఇంకొంతమంది సరైన అవగాహన లేకపోవడంతో తమకు తెలిసిన విషయాలే కరెక్ట్ అనుకుని అవే ఫాలో అవుతూ తమకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల బారిన పడుతుంటారు. అందులో క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ ముఖ్యమైన అంశం. క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నాం కనుక మన క్రెడిట్ స్కోర్ బాగానే ఉంటుంది అనే భావనలో ఉంటుంటారు. కానీ అన్నిసార్లు అది నిజం కాదు అనే విషయం మీకు తెలుసా ? సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినంత మాత్రాన్నే క్రెడిట్ స్కోర్ పెరిగినట్టు అని అనుకోలేం అని చెబితే నమ్ముతారా ? మీ సిబిల్ స్కోర్ పడిపోవడానికి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ లో ఆలస్యం అవడం లేదా అసలు పేమెంట్స్ చెల్లించకపోవడమే కారణం అని కాదు. క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి ఇంకొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అనేదే ఇప్పడు తెలుసుకుందాం.

1. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో
క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో తీసుకున్న రుణం చెల్లించడం లేదా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ లాంటివి ఒక్కటే కాదు.. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే మీకు ఉన్న క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత క్రెడిట్‌ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఉదాహరణకు మీకు లక్ష రూపాయల క్రెడిట్ కార్డు ఉంటే.. 30 లేదా 40 వేలకు మించకుండా క్రెడిట్ కార్డు వినియోగం ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా 70 వేలకు మించి క్రెడిట్ కార్డు వినియోగిస్తే.. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ తగ్గిపోతుంది. మీకు ఉన్న క్రెడిట్ లిమిట్‌ని పూర్తిగా ఉపయోగించడం, లేదా మీ ఆదాయం కంటే ఎక్కువ అప్పు చేయడం వంటి పరిణామాలు మీ క్రెడిట్ స్కోర్‌ని దెబ్బతీస్తాయి. 

2. క్రెడిట్ పరిమితి తగ్గించడం
మీ క్రెడిట్ స్కోర్‌ని లెక్కించేటప్పుడు క్రెడిట్ లిమిట్ ని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల మీ క్రెడిట్ లిమిట్ తగ్గించినట్లయితే, మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా తగ్గుతుంది. అదే కానీ జరిగితే ఆటోమేటిగ్గా మీ క్రెడిట్ స్కోర్‌ కూడా పడిపోతుంది.

3. రుణం కోసం వెంట వెంటనే దరఖాస్తులు
స్వల్ప కాల వ్యవధిలో ఏదైనా లోన్ కోసం కానీ లేదా క్రెడిట్ కార్డు కోసం కానీ వెంటవెంటనే దరఖాస్తు చేసుకుంటే మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీ ఆర్థిక స్తోమత సరిగ్గా లేదని.. అందుకే మీరు రుణాలు లేదా క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నారు అని బ్యాంకులు భావించడమే అందుకు కారణం.

4. క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడం
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తగ్గిపోవడానికి మరో కారణం మీరు మీ కార్డ్‌లలో ఏదైనా ఒక క్రెడిట్ కార్డుని శాశ్వతంగా క్లోజ్ చేయడమే. మీకు క్రెడిట్ కార్డ్ ఉండి, దానిని పరిమితిలో ఒక క్రమశిక్షణతో వినియోగిస్తున్నప్పుడే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే అందుకు భిన్నంగా క్రెడిట్ కార్డుని క్లోజ్ చేయిస్తారో.. అలాంటప్పుడు మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.

జాయింట్ లోన్ ఎకౌంట్ పేమెంట్స్ :
మీరు ఎవరితోనైనా కలిసి జాయింట్ లోన్ తీసుకున్నట్టయితే.. మీ భాగస్వామి ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఆసక్తి చూపించకపోతే.. అలాంటి సందర్భాల్లో కూడా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది జాయింట్ లోన్ కనుక మీ భాగస్వామి లోన్ ఎగవేసినా దాని నెగటివ్ ప్రభావం మీపై చూపిస్తుంది అని బ్యాంకర్స్ చెబుతున్నారు.

Trending News