Aadhaar Virtual ID: ఇకపై ఆధార్‌ అవసరం లేకుండా వర్చువల్‌ ఐడీతో అన్ని సేవలు

Aadhaar Virtual ID Uses How Do You Know: ప్రతి అవసరానికి.. ప్రభుత్వ సేవ పొందడానికి ప్రస్తుతం ఆధార్‌ తప్పనిసరిగా మారింది. విస్తృతంగా ఆధార్‌ వినియోగించడం ప్రమాదకరం. అందుకే ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఓ వర్చువల్‌ ఐడీ వచ్చేసింది. దాన్ని వినియోగించుకుని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 8, 2024, 05:48 PM IST
Aadhaar Virtual ID: ఇకపై ఆధార్‌ అవసరం లేకుండా వర్చువల్‌ ఐడీతో అన్ని సేవలు

Aadhaar Virtual ID: దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు అనేది తప్పనిసరిగా మారింది. భారతదేశ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ఆధార్‌ ఒక ధ్రువీకరణ కార్డు అయ్యింది. అయితే ఆధార్‌ కార్డును ఎక్కడ పడితే ఒక్క వినియోగిస్తే వ్యక్తిగత భద్రతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. గోప్యతకు భయం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆధార్‌ కార్డును కాకుండా ఆధార్‌ లాంటి సేవలను పొందేందుకు ఒక ఐడీ నంబర్‌ వచ్చింది. దానినే వర్చువల్‌ ఐడీ అంటారు. వర్చువల్‌ ఐడీ నేది ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య. ఆధార్‌ నంబర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా ఈ కేవైసీ వంటి వాటికోసం వర్చువల్‌ ఐడీ వినియోగించవచ్చు. ఆధార్‌ నంబర్‌ స్థానంలో వీఐడీ నంబర్‌ ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత గోప్యత ఉంటుంది.

వర్చువల్‌ ఐడీ పొందడం ఇలా..

  • ఆధార్‌ వర్చువల్‌ ఐడీ పొందాలంటే అధికారిక ఆధార్‌ వెబ్‌సైట్‌ 'యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా'ను సందర్శించాలి.
  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌ తెరిచాక భాషను ఎంచుకోవాలి
  • ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 'వర్చువల్‌ ఐడీ జనరేటర్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • వర్చువల్‌ ఐడీ జనరేటర్‌ను ఎంచుకున్నాక ఆధార్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ను పొందుపర్చాలి.
  • అనంతరం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పొందిపర్చిన అనంతరం వెరిఫై అండ్‌ ప్రాసెస్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు 16 అంకెల వర్చువల్‌ ఐడీ నంబర్‌ కనిపిస్తుంది. అంతేకాకుండా రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు సందేశం కూడా వస్తుంది.

ఆధార్‌ వర్చువల్‌ ఐడీ ప్రయోజనాలు

  • బ్యాంకు ఖాతా తెరవడం
  • ప్రభుత్వ సేలు పొందడానికి
  • ఈ కేవైసీ ప్రక్రియ చేయడం కోసం
  • ఆధార్‌ పీవీసీ కార్డు లేదా ఈ ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి
  • ప్రభుత్వ రాయితీలు పొందడానికి
  • పాస్‌పోర్టు దరఖాస్తు చేయడం కోసం
  • కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయడం కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News