Two Separate Road Accidents in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. అన్నమయ్య జిల్లాలో తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొనగా ఐదుగురు.. చిత్తూరు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీకొనడంతో నలుగురు మరణించారు. రెండు ప్రమాదాల్లో మొత్తం 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయా ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఘటనల వివరాలు ఇలా..
అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గురికి తీవ్ర గాయాలయ్యాయి. మఠంపల్లి క్రాస్ వద్ద తుఫాన్ వాహనంను లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఐదుగురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బలగాం జిల్లా బండి చేరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. శ్రీశైలం దర్శనం అనంతరం తిరుమల దర్శనానికి వెళ్లగా.. అక్కడ శ్రీవారి దర్శనం జరగకపోవడంతో తిరిగి వెళుతున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయలైన వారిని మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిలో తుఫాన్ డ్రైవర్ హనుమంతు (30), పర్యాటుకుల్లో హనుమంతు (40), అంబికా (14), శోభా (34), మనంద (32) ఉన్నారని చెప్పారు. గాయపడ్డ ఆరుగురిలో ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కేవి పల్లి ఎస్ఐ లోకేష్ తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఆయిల్ లారీ ట్యాంకర్ రోడ్డు వైపు నిలబెట్టి ఉండగా.. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి ఒరిస్సాకు వెళ్తున్న అంబులెన్స్ వెనక నుంచి ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను మంజులత, త్రిలోచనా, ఉమేష్ చంద్ర, విజయ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
Also Read: Ganesh Chaturthi 2022 Date: వినాయక చవితి ప్రత్యేకత, విగ్రహా ప్రతిష్ఠి సమయం, చవితి ప్రత్యేక తిథులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook