Suicide over Loan App Harassment : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. అవసరాల నిమిత్తం అప్పుగా తీసుకున్న డబ్బును చెల్లించలేకపోవడంతో ఆ దంపతులకు వేధింపులు మొదలయ్యాయి. అప్పు విషయాన్ని బంధువులకు ఫోన్లు చేసి చెప్పడం, నగ్న చిత్రాలు బయటపెడుతామని బెదిరింపులకు దిగడంతో ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొల్లి రమ్యలక్ష్మి (24), దుర్గాప్రసాద్ (32) దంపతులు బతుకుదెరువు నిమిత్తం రాజమండ్రిలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, రమ్యలక్ష్మి ఇంటి వద్ద కుట్టు మిషన్‌పై దుస్తులు కుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది.
ఇటీవల ఇంట్లో అవసరాలకు డబ్బులు లేకపోవడంతో లోన్ యాప్ ద్వారా దుర్గాప్రసాద్ కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అప్పు సకాలంలో చెల్లించలేదు. దీంతో లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. లోన్ యాప్ నిర్వాహకులు దుర్గాప్రసాద్ బంధువులకు కూడా ఫోన్లు చేసి అప్పు విషయం చెప్పారు. దీంతో దుర్గాప్రసాద్ దంపతులు అవమానంగా ఫీలయ్యారు.
లోన్ యాప్ నిర్వాహకులు మరింత బరితెగించి 'మీ నగ్న చిత్రాలు మావద్ద ఉన్నాయి. డబ్బులు చెల్లించకపోతే ఆ చిత్రాలను బయటపెడుతాం' అంటూ దుర్గాప్రసాద్ దంపతులను బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో మరింత కుమిలిపోయిన దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి ఈ నెల 5వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:ఆరోజు అసలు జరిగింది ఇదే.. నేను అక్కడే ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన బండి సంజయ్!
Also Read: NEET 2022 Results: నీట్ 2022 ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook