Dammaiguda School Girl Case దమ్మాయి గూడ కేసులో పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతోన్నారు. దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాల నుంచి ఇందు బయటకు వెళ్లడం వరకు కెమెరాలో రికార్డ్ అయి ఉంది. ఆమె ఎందుకు వెళ్లింది.. అనేది తెలియడం లేదు. చెరువులో ఆమెను ఎవరైనా తోసేశారా? పొరబాటున పడిందా? అన్నది క్లారిటీల లేకుండా పోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఎలాంటి అనుమానాలకు తావిచ్చేలా నివేదికలు రాలేదు. ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవని, చెరువులోని నీరు లోపలకి వెళ్లడంతోనే మరణించిన రిపోర్టులో ఉందట.
అయితే ఈ కేసులో సస్పెన్స్ మాత్రం ఇంకా వీడటం లేదు. ఈ కేసును చేధించేందుకు, దర్యాప్తు చేసేందుకు 10 బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందు మృతి ఇంకా మిస్టరీగానే ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ లతోపాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కేస్ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు తల్లిదండ్రుల మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేడు దమ్మయి గూడలో చిన్నారి ఇందు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read : Mancherial Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్ని ప్రమాదం.. 6 మంది సజీవదహనం! చుట్టం చూపుగా వచ్చి
Also Read : Avatar 2 Day 1 Collections : ఇండియాలో అవతార్ 2కు ఎదురుదెబ్బ.. రికార్డుల కొల్లగొట్టని జేమ్స్ కామెరాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook