Aftab Poonawalla in Tihar Jail: శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఢిల్లీలోని తీహార్ జైలులో అఫ్తాబ్ తొలి రాత్రి టెన్షన్‌తో గడిపాడు. అఫ్తాబ్‌ను జైలు నంబర్ 4లోని అతని సెల్‌కు తీసుకువెళ్లగా.. సాధారణంగా గడిపాడు. తోటి ఖైదీలు అతనితో మాట్లాడటగా.. అఫ్లాబ్ ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడుతున్నాడు. జైలు వార్డెన్ అఫ్తాబ్‌ను మిగిలిన ఖైదీలకు దూరంగా ఉండమని సూచించడంతో ఆ తర్వాత అతను ఒత్తిడికి గురయ్యాడు.
తీహార్ జైలులో అఫ్తాబ్ సాధారణ ఆహారాన్ని తీసుకున్నాడు. రాత్రంతా దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. అతని కదలికలను అధికారులు సీసీటీవీ ద్వారా పర్యవేక్షించారు. అఫ్తాబ్‌కు నార్కో పరీక్ష సోమవారం నిర్వహించే అవకాశం ఉంది. నార్కో టెస్టులో శ్రద్ధా హత్య కేసులో అసలు నిజం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. శనివారం విచారణ అనంతరం అఫ్తాబ్‌ను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. అంతకుముందు అతను పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు.
మరోవైపు శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కోర్టు పిటిషనర్‌కు రూ.10 వేల జరిమానా కూడా విధించింది. మీడియా దృష్టిని ఆకర్షించడానికి న్యాయవాది చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదని కోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో ఢిల్లీ పోలీసులు ఫోరెన్సిక్ సాక్ష్యాలను భద్రపరచలేదని, మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లోని రికవరీ కథనాలు అందుబాటులో లేవని న్యాయవాది ఆరోపణలు చేయడం దురదృష్టకరమని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కేవలం ప్రచారం కోసమే ఈ పిటిషన్ దాఖలయ్యిందని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు తీరు, నాణ్యతలో లోపాలను చూపేందుకు పిటిషన్‌లో ఏమీ లేదని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, వాటిని ప్రోత్సహించరాదని సూచించింది. నిరాధారమైన ఆరోపణలు నేర న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని.. ఢిల్లీ పోలీసులు వృత్తిపరమైన విభాగం, వారి మనోధైర్యాన్ని పెంచడానికి ఇటువంటి పిటిషన్లను తీవ్రంగా ఖండించాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం శ్రద్ధా హత్య కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అఫ్తాబ్‌ను ఛతర్‌పూర్‌లోని అతని ఇంటికి కూడా తీసుకెళ్లారు. అక్కడే అతను శ్రద్ధాను దారుణంగా చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో ఉంచాడు. అనంతరం మృతదేహంలోని ఈ ముక్కలను వేర్వేరు ప్రాంతాల్లో విసిరాడు.
Also Read: Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
Also Read: Sanju Samson: ఒక్క మ్యాచ్‌కే సంజూ శాంసన్ బెంచ్‌కు.. ఎందుకు ఈ వివక్ష..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook