Accident in Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న టాటా సుమో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదం కిష్త్వార్ జిల్లాలోని మార్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు స్థానికుల సాయంతో రెస్కూ ఆపరేషన్ చేపట్టి.. మృతదేహాలను బయటకు తీశారు. డెడ్ బాడీస్ ను పోస్టు మార్టం నిమిత్తం నౌపాచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో నౌపాచికి చెందిన ఉమర్ గనీ షా, ఛంజెర్కు చెందిన మహ్మద్ అమీన్, ఖాదర్నాకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, తాచ్నాకు చెందిన అఫాక్ అహ్మద్, ఆసియా బానోగా పోలీసులు గుర్తించారు. డీఏపీ నేత, మాజీ మంత్రి జీఎం సరూరి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం వ్యక్తం చేశారు. "కిష్త్వార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గురించి తెలుసుకుని బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించా..'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తామని ఆయన చెప్పారు.
Anguished to learn about the loss of lives in a road accident in Kishtwar. My deepest condolences to bereaved families. Directed district administration to provide all necessary assistance.
— Office of LG J&K (@OfficeOfLGJandK) November 16, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి