Blackmail: ఈ టిల్లుగాడు రాధిక కన్నా డేంజర్‌గాడు .. ఫ్రెండ్‌ ఫోన్‌ తీసుకుని బ్లాక్ మెయిల్

Friends Blackmailing With Personal Photos In Hyderabad: ఈ టిల్లుగాడు రాధిక కన్నా కంత్రీ. స్నేహితుడి ఫోన్‌ తీసుకుని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. పోలీసులు అతడి ఆట కట్టించడంతో జైలు పాలయ్యాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 23, 2024, 03:49 PM IST
Blackmail: ఈ టిల్లుగాడు రాధిక కన్నా డేంజర్‌గాడు .. ఫ్రెండ్‌ ఫోన్‌ తీసుకుని బ్లాక్ మెయిల్

Blackmail: డీజే టిల్లులో రాధిక జగతకంత్రీ. కానీ ఇక్కడ నిజ జీవితంలో టిల్లు గాడు కంత్రీ. స్నేహితుడు ఫోన్‌ తాకట్టు పెట్టగా.. ఆ ఫొన్‌లోని వ్యక్తిగత ఫొటోలు చూసి స్నేహితుడినే బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. ఈ టిల్లు గాడికి తోడు టైసన్‌లాంటోడు జమయ్యాడు. అయితే వీరి బ్లాక్‌ మెయిలింగ్‌తో విసిగిపోయిన స్నేహితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫలితంగా టిల్లు, టైసన్‌ లాంటి వ్యక్తి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Also Read: Jabardasth Actor: రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ దుర్మరణం.. విషాదంలో బుల్లితెర

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రియాజ్ ఆలీ అనే యువకుడు ఉన్నాడు. తనకు వెంటనే డబ్బులు అవసరం కావడంతో తన ఫోన్‌ను తన స్నేహితులైన జ్ఞానేశ్వర్‌కు తాకట్టు పెట్టాడు. ఫోన్‌ ఉంచుకుని జ్ఞానేశ్వర్‌ రియాజ్‌కు డబ్బులు ఇచ్చాడు. అయితే ఫోన్‌ పెట్టుకున్న జ్ఞానేశ్వర్‌ మొత్తం తెరచి చూశాడు. రియాజ్‌ తన స్నేహితురాలితో కలిసి ఉన్న ఫొటోలను గమనించాడు. వాటిని తన స్నేహితుడైన హేమంత్ అలియాస్‌ టిల్లుకు పంపించాడు.

Also Read: Hyderabad Murders: హత్యలతో హైదరాబాద్‌ హడల్‌.. 24 గంటల్లో 5 హత్యలు.. నగరవాసుల బెంబేలు

 

తన స్నేహితురాలితో ఉన్న వ్యక్తిగత ఫొటోలను ఆసరాగా చేసుకుని టిల్లు, జ్ఞానేశ్వర్ ఇద్దరు రియాజ్ ఆలీని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. డబ్బులు ఇస్తావా ఆ ఫొటోలు ఇతరులకు పంపాల్నా అని బెదిరించారు. డబ్బుల కోసం రియాజ్‌ను వేధించారు. స్నేహితులు అని నమ్మి ఫోన్‌ ఇస్తే వ్యక్తిగత ఫొటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడడంతో రియాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఘట్‌కేసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన ఫోన్‌ నుంచి ఫొటోలను తస్కరించి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్న జ్ఞానేశ్వర్, టిల్లుపై ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్‌లో రియాజ్‌ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జ్ఞానేశ్వర్‌, టిల్లులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంచాలని పోలీసులు సూచించారు. ఇలాంటి బ్లాక్‌ మెయిలింగ్‌కు గురవుతున్న బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని ఘట్‌కేసర్‌ పోలీసులు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x