Samntha Sunglasses: ఆ కోతి టేస్ట్ అదిరింది కదా..బాలిలో సమంత సన్‌గ్లాసెస్ తస్కరించిన కోతి

Samntha Sunglasses: దక్షిణాది టాప్ నటి సమంతా గురించి తెలియని వాళ్లుండరు. కెరీర్ రెండవ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న సమంతా ఇప్పుడు ఇండోనేషియాలో వెకేషన్ గడుపుతోంది. ఆ వెకేషన్ నుంచి ఆసక్తికరమైన ఘటనను షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపర్చింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2023, 06:43 PM IST
Samntha Sunglasses: ఆ కోతి టేస్ట్ అదిరింది కదా..బాలిలో సమంత సన్‌గ్లాసెస్ తస్కరించిన కోతి

Samntha Sunglasses: సినిమా షూటింగుల్నించి విశ్రాంతి పొందేందుకు ఇండోనేషియా బాలిలో వెకేషన్ గడపడం సమంతకు అలవాటు. కెమేరాకు దూరంగా బాలి అందాల్ని ఆస్వాదిస్తూ ఇండోనేషియాలో ఉన్న సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో తన అనుభవాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటుూ ఉంటుంది. ఈసారి షేర్ చేసిన ఆమె అనుభవం అందర్నీ ఆకట్టుకుంటోంది.

సమంత అంటే అందరికీ ఇష్టం. అందమైన ఆమె నవ్వు అందర్నీ కట్టిపడేస్తుంటుంది. అందం అభినయంతో పాటు చక్కని భావాలు కలిగిన నటి ఆమె. ఆమె ఏది చేసినా ట్రెండింగే. ఈసారి ఆమెకు కోతులు కూడా ఫిదా అవుతున్నాయి. అందుకే బాలిలో వెకేషన్ గడుపుతున్న ఆమె కూలింగ్ గ్లాసెస్‌ను ఓ కోతి దొంగిలించేసింది. బాలిలోని ఉలువాటులో రోడ్ ట్రిప్ చేస్తున్న ఆమెకు ఎదురైన ఈ అనుభవాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.

బాలి సమీపంలోని ఉలువాటులో ఆమె పర్యటన ఈసారి చాలా సర్‌ప్రైసింగ్‌గా నిలిచిందంటోంది. ఈ ట్రిప్‌లో ఫోటోకు పోజులిస్తుండగా పక్కనే ఉన్న ఓ కోతి ఆమె కూలింగ్ గ్లాసెస్‌ను పట్టుకుని లగెత్తింది. కూలింగ్ గ్లాసెస్‌తో షేర్ చేసిన ఓ ఫోటోలో ఆ ఫన్నీ కోతి కూడా దర్శనమిస్తోంది. సమంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోతుల గుంపు సందడి చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. మరో వీడియోలో ఓ వ్యక్తి సమంత సన్‌గ్లాసెస్‌ను కోతి నుంచి పొందేందుకు చేసిన విఫలయత్నాన్ని చూడవచ్చు. ఆ కోతికి మంచి టేస్ట్ ఉందంటూ సమంత ట్యాగ్ చేసి కామెంట్ చేయడం విశేషం.

తన సన్‌గ్లాసెస్‌ను ఆ కోతి తస్కరించకముందు ఇన్‌స్టాలో సమంత అక్కడి అందమైన ఫోటోల్ని షేర్ చేసింది. బాలిలో అందమైన అనుభవాల్ని అభిమానులతో పంచుకుంది. ఓ పాత భవంతి గోడకు ఆనుకుని..ఉలువాటు ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్న ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. 2022 అక్టోబర్ నెలలో మయోసైటిస్ ఉందని నిర్ధారణ కావడంతో తాత్కాలికంగా సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్టు సమంత ప్రకటించింది. మయోసైటిస్ అనేది ఆమటో ఇమ్యూన్ డిసార్డర్. కండరాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆనారోగ్యంతో ఉన్నా పెండింగు ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది.

సిటాడెల్ సినిమా ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించనున్న సమంతాను చూసేందుకు ఆమె అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండతో నటించిన సినిమా ఖుషి సెప్టెంబర్‌లో విడుదల కానుంది. 

Also read: Bro Movie: 'కిల్లీ కిల్లీ' సాంగ్‌ కొత్త వెర్షన్‌ వచ్చేసింది.. మామాల్లుళ్లతో అదిరిపోయే స్టెప్పులేసిన థమన్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News