Aadi Movie Re Release: నవంబర్లో 'ఆది' రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు విషమ పరీక్షే.. ఎందుకంటే?

Aadi Movie To Re Release in November: Crucial Time for Junior NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 26, 2022, 12:33 PM IST
Aadi Movie Re Release: నవంబర్లో 'ఆది' రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు విషమ పరీక్షే.. ఎందుకంటే?

Aadi Movie To Re Release in November: Crucial Time for Junior NTR Fans: గతంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగింది. ముందుగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలను రీ రిలీజ్ చేసిన నిర్మాతలు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా జల్సా, తమ్ముడు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఘరానా మొగుడు, ఇటీవల నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాను రిలీజ్ చేశారు.

నందమూరి బాలకృష్ణ, చెన్నకేశవరెడ్డి సినిమా రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా చూడమని సినిమా చూస్తే వచ్చే ఆదాయంలో సింహభాగం నందమూరి బాలకృష్ణ గారు పేదల కోసం సేవ చేస్తున్న బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ కి విరాళంగా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కూడా విడుదల చేస్తామని ఆయన పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఆయన ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని వెల్లడించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆది సినిమాలో ఆ జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించగా అలీ, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు వివి వినాయక్ డైరెక్షన్ చేశారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాక జూనియర్ ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది.

అయితే నవంబర్ నెలలో విడుదలవుతున్న ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీకి ఈ మధ్య కాస్త దూరం పెరిగింది. ఎన్ఠీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో ఆయన చేసిన ట్వీట్ అర్థవంతంగా లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా దారుణమైన విధంగా జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల వద్ద నారా కుక్కలు అనే విధంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే టీడీపీ అభిమానులు మునుపటిలా జూనియర్ ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తూ థియేటర్లకు వెళ్లడం కాస్త కష్టమైన విషయమే.

ఇప్పుడు రీ రిలీజ్ విషయంలో ఒక్కో సినిమాతో ఒక్కో రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్కడు సినిమా రికార్డులను జల్సా సినిమా బద్దలు కొడితే జల్సా సినిమా రికార్డులను కొన్ని చోట్ల చెన్నకేశవరెడ్డి సినిమా బద్దలు కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎలా అయినా ఆది రీ రిలీజ్ విషయంలో మిగతా సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలని భావిస్తారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కాస్త సఖ్యత దూరమైనా నేపథ్యంలో వారి సహకారం సహాయం లేకుండా ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే ఆయన సినిమాతో రికార్డులు బద్దలు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోని ఎంతవరకు సపోర్ట్ చేసుకుంటారు, సినిమాల రికార్డులు ఎలా బద్దలు కొడతారు అనేది.

Also Read: Ginna Movie Postponed : పెద్దలతో ఎందుకులే.. వెనక్కు తగ్గిన మంచు విష్ణు.. జిన్నా వాయిదా!

Also Read: The Ghost in Hindi: చిరుతో పోటీకి నాగ్.. హిందీలో కూడా వెనక్కు తగ్గకుండా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News