Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ వేసేందుకు రెడీ.. రంగంలోకి దిగబోతోన్న ఆది సాయికుమార్

Aadi Sai Kumar Top Gear ఆది సాయి కుమార్ టాప్ గేర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ విడుదల తేదీని మేకర్లు తాజాగా లాక్ చేసేశారు. ఈ మేరకు చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 05:19 PM IST
  • ముచ్చటగా మూడు చిత్రాలతో ఆది సందడి
  • టాప్ గేర్ అంటూ ఆది సాయి కుమార్ హల్చల్
  • డిసెంబర్ 30న రాబోతోన్నట్టుగా ప్రకటన
Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ వేసేందుకు రెడీ.. రంగంలోకి దిగబోతోన్న ఆది సాయికుమార్

Top Gear Movie Release Date : ఆది సాయి కుమార్ ఈ ఏడాది వరుసగా చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో మాస్ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఇప్పటికే ఆది టాప్ గేర్ సినిమాకు సంబంధించిన అప్టేట్లు వచ్చాయి. మోషన్ పోస్టర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

టాప్ గేర్ సినిమాలో ఆది సాయి కుమార్ ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని కథ మాత్రం ఎవ్వరి ఊహకు అందనట్టుగా ఉంటుందట. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మిస్తోంది. శశికాంత్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది.

ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్లు ప్రకటించారు. అంతే కాకుండా త్వరలోనే ఈ మూవీ నుంచి మొదటి పాటను కూడా విడుదల చేయబోతోన్నారట. ఇక ఈ మూవీని డిసెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. అంటే ఈ ఏడాదిలోనే ఆది మూడు సినిమాలతో సందడి చేసినట్టు అవుతుందన్న మాట.

శ్రీధర్ రెడ్డి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రంలో శత్రు, రేడియో మిర్చి హేమంత్, బెనర్జీ, మైమ్ గోపి, నర్రా, చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్, బ్రహ్మాజీ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ఆది సరసన రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. ఇది వరకు ఈ ఇద్దరి కెమిస్ట్రీకి సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అయ్యాయి.

Also Read : Vennela Kishore : ఎంత పని చేశావ్ బ్రో.. వెన్నెల కిషోర్ చేసినదానికి నెటిజన్ రియాక్షన్

Also Read : Actor Lohithaswa: అఖండ నటుడి ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News