Aamir Khan: కాకినాడలో ఆమిర్‌ఖాన్‌ సందడి

Aamir khan: బాలీవుడ్‌ హీరో అమిర్‌ఖాన్‌ కాకినాడకు విచ్చేశారు. ‘'లాల్‌సింగ్ చద్దా'’ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఆయన ఇక్కడకు వచ్చారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2021, 12:41 PM IST
  • కాకినాడలో ఆమిర్‌ఖాన్‌ సందడి
  • ఆమిర్ బస చేసిన హోటల్‌ వద్ద భారీ భద్రత
  • కొవిడ్ నేపథ్యంలో అభిమానులకు అనుమతి నిరాకరణ
Aamir Khan: కాకినాడలో ఆమిర్‌ఖాన్‌ సందడి

Aamirkhan: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. లాల్‌సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ఇక్కడకు విచ్చేశారు. రెండురోజులపాటు ఇక్కడే ఉంటారు. జిల్లాలో ఆయనపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడ బీచ్‌లో చిత్రీకరణ జరగనుంది. అమీర్‌ఖాన్‌(Aamirkhan) కాకినాడ(Kakinada)లోని ఓ హోటల్‌లో బస చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆయన్ని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఆయన బస చేసిన హోటల్‌కు ప్రైవేట్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.

Also Read: Prabhas photos leaked: సలార్ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ప్రభాస్ ఫోటోలు, వీడియోలు

‘లాల్‌సింగ్‌ చద్దా(Lal Singh Chaddha)’ సినిమాలో కరీనా కపూర్(Kareena Kapoor), నాగచైతన్య(Naga chaitanya) కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమలాపురం సమీపంలోని ఓడలరేవులో శుక్రవారం తెల్లవారుజామున షూటింగ్‌ జరుగనున్నట్టు సమాచారం. అలాగే శనివారం కాకినాడ బీచ్‌లో ఆమిర్‌ఖాన్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తోంది. రెండ్రోజుల షూటింగ్‌ అనంతరం ఆయన శనివారం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారని ఆమిర్‌ఖాన్‌ వ్యక్తిగత సిబ్బంది ఒకరు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News