Adivi Sesh Health update: ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హీరో అడివి శేష్

Adivi Sesh: టాలీవుడ్ యువ నటుడు అడవిశేష్ అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా ఆయన హెల్త్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఇవాళ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అడవిశేష్. ఈ హీరో కొద్ది రోజుల కిందట డెంగ్యూ బారిన పడిన సంగతి తెలిసిందే.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 12:43 PM IST
  • అడివి శేష్ అభిమానులకు శుభవార్త
  • అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హీరో
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అడవి శేష్
Adivi Sesh Health update: ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హీరో అడివి శేష్

Adivi Sesh Health update: విభిన్న కథాచిత్రాల నాయకుడు అడవిశేష్(Adivi Sesh) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఆయన డెంగ్యూ(Dengue) బారిన పడటంతో..సెప్టెంబర్ 18న హైదరబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి..చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అడవి శేష్. తన ట్విట్టర్(Twitter) ఖాతాలో.. ఇంటికి తిరిగి వచ్చాను.. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

టాలీవుడ్ లో అడివి శేష్ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ..తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మేజర్(Major) సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు ఈ హీరో.  26/11 ముంబై టెర్రర్ అటాక్‏లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Love story: 'లవ్‌స్టోరీ' టీమ్‌పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం...చైతూ నటనను, సాయిపల్లవి డ్యాన్స్ ను మెచ్చుకున్న మహేశ్..

ఇక మహేష్ బాబు(Mahesh Babu) జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'హిట్'(HIT) సిక్వెల్‏లోనూ అడివి శేషు నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News