Love story: 'లవ్‌స్టోరీ' టీమ్‌పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం...చైతూ నటనను, సాయిపల్లవి డ్యాన్స్ ను మెచ్చుకున్న మహేశ్..

Love Story: నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా స్పందించారు. ఈ చిత్రం ద్వారా నాగచైతన్య తనలోని నటుడిని ప్రతి ఒక్కరికీ పరిచయం చేశాడని అభినందించారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2021, 04:42 PM IST
  • 'లవ్‌స్టోరీ' టీమ్‌పై మహేశ్ బాబు ప్రశంసల వర్షం
  • చైతన్యకు ఈ మూవీ గేమ్ చేంజరన్న సూపర్ స్టార్
  • సాయి పల్లవికి నిజంగా ఎముకలు ఉన్నాయా?
Love story: 'లవ్‌స్టోరీ' టీమ్‌పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం...చైతూ నటనను, సాయిపల్లవి డ్యాన్స్ ను మెచ్చుకున్న మహేశ్..

Mahesh Babu On Love Story : అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా మెుదటి నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా  ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌(MaheshBabu) ట్విటర్‌ వేదికగా చిత్రబృందంపై అభినందనల వర్షం కురిపించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని.. చిత్రబృందం పడిన కష్టానికి సరైన విజయం దక్కిందని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం సమాజంలో మనం చూస్తోన్న ఎన్నో విషయాలను సున్నితంగా చెబుతూ అద్భుతమైన చిత్రాన్ని అందించారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. నాగచైతన్య(Naga Chaitanya) తనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక, సాయిపల్లవి(Sai Pallavi) ఎప్పటిలాగే అదరగొట్టేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? ఆన్‌స్క్రీన్‌పై ఇలాంటి డ్యాన్స్‌ నేను ఇప్పటివరకూ చూడలేదు. ఆమె డ్యాన్స్‌ ఒక కలలా ఉంది. సినిమాకి పవన్‌ అందించిన మ్యూజిక్‌ సెన్సేషనల్‌. రెహమాన్‌ సర్‌.. మీ శిష్యుడు మిమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’(Love Story) చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసిన చిత్ర నిర్మాతలకు నా అభినందనలు’’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

Also read: Love Story Movie : సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న లవ్‌స్టోరి మూవీ.. ఒక్కరోజులోనే అన్ని కోట్లు వసూలు చేసిందట

 

శేఖర్‌ కమ్ముల దర్శకత్వం(Director Shekhar Kammula) వహించిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya) మధ్యతరగతి యువకుడిగా రేవంత్‌ పాత్రలో మెప్పించారు. బీటెక్‌ పూర్తి చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకునే అమ్మాయిగా సాయిపల్లవి నటించారు. సమాజంలో ఉన్న కుల వ్యవస్థతోపాటు కుటుంబంలో ఉండే వ్యక్తుల నుంచే అమ్మాయిలు ఏవిధంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారే విషయాన్ని ఈ చిత్రంలో ఎంతో సున్నితంగా శేఖర్‌ చూపించారు. ఈశ్వరీ, రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌, దేవయానీలు తమ పాత్రలకు న్యాయం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x