Navin Chandra: తండ్రి అయిన హీరో నవీన్ చంద్ర.. నెట్టింట ఫొటోలు వైరల్

Navin Chandra Blessed With Baby Boy: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఓర్మా పండంటి బాబుకు జన్మనివ్వగా.. తన కొడుకు ఫొటోలను నవీన్ చంద్ర నెట్టింట పోస్ట్ చేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 04:11 PM IST
Navin Chandra: తండ్రి అయిన హీరో నవీన్ చంద్ర.. నెట్టింట ఫొటోలు వైరల్

Navin Chandra Blessed With Baby Boy: డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తూ.. హీరోగా, విలన్‌గా, సైడ్ హీరోగా ఇలా ఏ క్యారెక్టర్ అయినా అలవోకగా పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ చంద్ర. తాజాగా నవీన్ చంద్ర ఇంట్లోకి వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆయన భార్య ఓర్మా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నవీన్ చంద్ర సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన కొడుకును ఎత్తుకుని తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు నవీన్ చంద్రకు అభినందనలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్ చంద్ర ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. 

'బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడుతానా..? అని ఎదురుచూసేందుకు ఆగలేకపోతోన్నాను..' అంటూ ఇటీవలె నవీన్ చంద్ర పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులం అవుతున్నామనే ఆలోచన ఎంతో గొప్పగా ఉందన్నాడు. కొత్త దశ, కొత్త జీవితం, కొత్త ప్రయాణం.. తండ్రిని కాబోతోన్నానంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా కొడుకు పుట్టిన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

అందాల రాక్షసి మూవీ ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. ఈ మూవీలో ప్రేమికుడి నవీన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత హీరోగా నటిస్తూనే.. నేను లోకల్, అరవింత సమేతా వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు పోషించాడు.  

ప్రస్తుతం నవీన్ చంద్రకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూనే.. ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. తాజాగా ఇంటికి వారసుడు రావడంతో ఆనందం రెట్టింపయింది. ఇన్నాళ్లు తన ఫ్యామిలీ విషయాలను ఎప్పుడు పంచుకోలేదు నవీన్ చంద్ర. ప్రస్తుతం ఓ ద్విభాషా చిత్రంలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. వాణీ భోజన్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు   

Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News