Kajal Aggarwal Pregnancy Rumours: తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..? త్వరలోనే సినిమాలకు గుడ్ బై..??

అటు టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు ఇటు సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందట..?? ఆ వార్తా ఏంటో మీరే చూడండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2021, 04:08 PM IST
  • కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటు వార్తలు
  • కొత్త ప్రాజెక్టులకు అంగీకరించని కాజల్
  • ఎలాంతో ప్రకటన చేయని కాజల్ అగర్వాల్ దంపతులు
Kajal Aggarwal Pregnancy Rumours: తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..? త్వరలోనే సినిమాలకు గుడ్ బై..??

Kajal Aggarwal Pregnancy Rumours: కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసిన లిస్టులో కాజల్ కూడా  ఉంది. నటన, అభినయం, అందంతో సౌత్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం హీరోయిన్ కాజల్ గురించిన  ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. 

గతేడాది  అక్టోబర్‌30న ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లుతో (Gautam Kitchlu) హీరోయిన్ కాజల్ వివాహం జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తరువాత కూడా ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ వస్తున్న కాజల్ గత కొంత కాలంగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదంట... దానికి కారణం త్వరలోనే తల్లి కాబోతుందని, అందరికి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. 

Also Read: Heart Wrenching Video:హెల్మెట్ లేకపోతే ఇతడి తల పుచ్చకాయలా పేలిపోయేది..! (వీడియో)

తల్లి కాబోతున్న కాజల్ ఇపుడు ఒప్పుకున్న ప్రాజెక్టులకు పూర్తీ చేసాక.. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట... ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చిరజీవితో (Chiranjeevi) ఆచార్య (Acharya Movie) సినిమాలో ఆడిపాడనుండగా.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తో ఘోస్ట్‌ (Ghost) సినిమాలో నటిస్తుంది. 

తల్లి కాబోతున్న సందర్భంగా ఈ రెండు సినిమాలలో తన వంతు షూటింగ్ పార్ట్ తొందరగా పూర్తీ చేయాలని సినిమా నిర్మాతలను కోరిందట.. వీటి తరువాత పూర్తీ విశ్రాంతి తీసుకోవాలని మరియు ఈ కారణం చేతనే కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవటం లేదని టాక్. 

Also Read: Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో అందరిని ఫూల్ చేసిన అమ్మాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

వచ్చే ఏడాది వరకు అన్ని పూర్తీ చేసాక ఇక నటనకు పూర్తిగా స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుందని సోషల్‌ మీడియా కోడై కూస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వార్త విన్న కాజల్ కానీ, ఆమె భర్త  గౌతమ్‌ కిచ్లు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News