Charmy wedding:పెళ్లి గురించి చార్మీ కౌర్ బోల్డ్ కామెంట్స్

Charmy squashes her wedding plans: పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, తనకు పెళ్లి మీద ఏ మాత్రం ఆసక్తి లేదని ఎప్పటికప్పుడు చార్మీ మాత్రం చెబుతూనే వస్తున్నా అప్పుడప్పుడు ఈ పెళ్లి రూమర్స్‌కి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2021, 01:29 AM IST
Charmy wedding:పెళ్లి గురించి చార్మీ కౌర్ బోల్డ్ కామెంట్స్

Charmy squashes her wedding plans: పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, తనకు పెళ్లి మీద ఏ మాత్రం ఆసక్తి లేదని ఎప్పటికప్పుడు చార్మీ మాత్రం చెబుతూనే వస్తున్నా అప్పుడప్పుడు ఈ పెళ్లి రూమర్స్‌కి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు. హీరోయిన్స్ పెళ్లి న్యూస్ అంటే ఆడియెన్స్‌కి ఎప్పుడూ ఆసక్తిరేకెత్తించే అంశమే కదా మరి. అందుకేనేమో హీరోయిన్స్ పెళ్లి వార్తలు తరచుగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటాయి.

తాజాగా మరోసారి తన పెళ్లి వార్తలపై స్పందించిన బొద్దుగుమ్మ చార్మి (Charmee wedding news).. తనకు పెళ్లి చేసుకోవడమా ? అలాంటి తప్పు తాను ఎప్పుడూ చేయబోను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ప్రస్తుతం తాను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని, పెళ్లి చేసుకుని ఆ సంతోషాన్ని పాడు చేసుకోదల్చుకోలేదనన్నట్టుగా చార్మీ స్పష్టంచేసింది. అంతేకాకుండా ఇలాంటి స్టోరీలు అల్లుకోవడంలో మీకు మీరే దిట్ట అన్నట్టుగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించింది ఈ అమ్మడు.

గతంలో చార్మీని పూరి జగన్నాథ్‌కి ముడిపెడుతూ పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాల ప్రొడక్షన్ బాధ్యతల్లో చార్మీదే కీలక పాత్ర కావటమే అందుకు కారణమైంది. పూరి డైరెక్ట్ చేసి నిర్మాతగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి చార్మి సహ నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ చిత్రాన్ని చార్మి కొ-ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే, పూరి జగన్నాథ్‌తో కలిసి చార్మీ (Actress Charmi kaur) చిత్రాలు నిర్మించినంత మాత్రాన్నే ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది.

Trending News