Bigg Boss 3 payment: బిగ్ బాస్ 3 పారితోషికం ఇంకా రాలేదంటున్న హీరోయిన్

Actress Kasthuri remuneration for Bigg Boss : బిగ్ బాస్ 4 తమిళ సీజన్ అక్టోబర్ 4 నుండి విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ షోకి కమల్ హసన్ హోస్ట్‌గా ( Kamal Haasan ) వ్యవహరించనున్నారు. ఐతే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 కంటెస్టెంట్ అయిన సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ( Bigg Boss 3 tamil contestant Kasthuri ) చేసిన వ్యాఖ్యలు తాజాగా ఈ షోను టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేశాయి. 

Updated: Oct 1, 2020, 05:52 AM IST
Bigg Boss 3 payment: బిగ్ బాస్ 3 పారితోషికం ఇంకా రాలేదంటున్న హీరోయిన్
Image Courtesy: Instagram

Actress Kasthuri remuneration for Bigg Boss : బిగ్ బాస్ 4 తమిళ సీజన్ అక్టోబర్ 4 నుండి విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ షోకి కమల్ హసన్ హోస్ట్‌గా ( Kamal Haasan ) వ్యవహరించనున్నారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదలైనప్పటి నుండి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఐతే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 కంటెస్టెంట్ అయిన సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ( Bigg Boss 3 tamil contestant Kasthuri Shankar) చేసిన వ్యాఖ్యలు ఈ షోను టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేశాయి. బిగ్ బాస్ 3 షోకి సంబంధించిన పేమెంట్ తనకు అందలేదని కస్తూరి ట్విటర్ ద్వారా చేసిన కామెంట్స్ ఆ షోపై రకరకాల కామెంట్స్ రావడానికి కారణమయ్యాయి. Also read : Chiranjeevi requests Rajamouli: రాజమౌళికి చిరంజీవి రిక్వెస్ట్ !

బిగ్ బాస్ 3 షో ద్వారా వచ్చిన మొత్తాన్ని బాల కార్మికుల విముక్తి కోసం వెచ్చించడానికి ఆ షోలో పాల్గొన్నానని.. కానీ అసలు ఆ డబ్బులే రాలేదని కస్తూరి చేసిన ట్వీట్ తమిళ సినీ, బుల్లితెర వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలకు తెరతీసింది. సంవత్సరం దాటినా నా పేమెంట్ చెల్లించని విజయ్ టీవీకి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు రావటం లేదు అని కస్తూరి పలు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అలాగే ఆ టీవీ చానల్ వాళ్ల ఫేక్ ప్రామిస్‌లను తాను ఎప్పుడూ నమ్మలేదని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అని కస్తూరి పేర్కొన్నారు.

బిగ్ బాస్ 3 తమిళ షోలో కస్తూరి శంకర్ 7వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి ప్రవేశించారు ( Kasthuri in Bigg Boss 3 Tamil ). 18 రోజుల తరువాత, అనగా బిగ్ బాస్ హౌజ్‌లో 63 వ రోజున కస్తూరి ఎలిమినేట్ అయ్యారు. Also read : Anchor Pradeep’s wedding: యాంకర్ ప్రదీప్‌కి పొలిటీషియన్ కూతురితో పెళ్లి ?

కస్తూరి తెలుగులో గ్యాంగ్ వార్, నిప్పు రవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య వంటి చిత్రాలలో నటించింది ( Actress Kasthuri Telugu movies ). ప్రస్తుతం ఆమె తెలుగు టీవీ సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe