Anchor Pradeep’s wedding: యాంకర్ ప్రదీప్‌కి పొలిటీషియన్ కూతురితో పెళ్లి ?

పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రదీప్ ఏ షో చేసిన అందులో తోటి యాంకర్లు కానీ, జడ్జిలు కానీ మొదటగా ప్రదీప్‌ని అడిగే ప్రశ్న ' ప్రదీప్.. నీ పెళ్లేప్పుడు' అని. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాదానం దొరికిందని తెలుస్తోంది. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజుకు పెళ్లి కుదిరిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Last Updated : Sep 30, 2020, 11:54 PM IST
Anchor Pradeep’s wedding: యాంకర్ ప్రదీప్‌కి పొలిటీషియన్ కూతురితో పెళ్లి ?

Anchor Pradeep wedding rumours: పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రదీప్ ఏ షో చేసిన అందులో తోటి యాంకర్లు కానీ, జడ్జిలు కానీ మొదటగా ప్రదీప్‌ని అడిగే ప్రశ్న ' ప్రదీప్.. నీ పెళ్లేప్పుడు' అని. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాదానం దొరికిందని తెలుస్తోంది. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజుకు పెళ్లి కుదిరిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యాంకర్ ప్రదీప్ ( Anchor Pradeep Machiraju ) త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. రాయలసీమకు చెందిన రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్‌కి పెళ్లి ఫిక్స్ అయినట్టు, ఈ ఏడాది చివరిలో ప్రదీప్ వివాహం జరుగనుందనేది ఆ ప్రచారం సారాంశం. ప్రదీప్ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించనప్పటికి ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also read : Actress Trisha turning point: త్రిష జీవితాన్నే మార్చిన రోజు

ప్రదీప్ పెళ్లి ( Anchor Pradeep's marriage news ) గురించి సోషల్ మీడియాలో కథనాలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలాగే పలానా యాంకర్‌తో ప్రదీప్ పెళ్లి, పలానా నటితో ప్రదీప్ పెళ్లి అంటూ ఎన్నోసార్లు పుకార్లు షికార్లు చేశాయి. కనుక ప్రదీప్ అధికారికంగా స్పందించే వరకు ఏది నిజమో.. ఏది అవాస్తవమో చెప్పడం కష్టమే.

గతంలో, ప్రదీప్ పెళ్లి గురించి ఓ టీవీ చానల్‌లో ఏకంగా ఒక ప్రోగ్రామే చేశారు. ఆ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది యువతుల పాల్గొనడం జరిగింది. కాకపొతే ఆ షో ఫ్లాప్ అయింది అది వేరే విషయం అనుకోండి. Also read : Anushka about Adipurush: ఆదిపురుష్‌లో సీత పాత్రపై స్పందించిన అనుష్క

బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ ప్రదీప్.. వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ( 30 rojullo preminchadam ela ) అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్.. ప్రస్తుతం ఆ చిత్రం విడుదల కోసం వేచిచూస్తున్నాడు. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా థియేటర్‌లు మూతపడడంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్దమవుతోందని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x