Adipurush Movie: టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ హీరోగా సెటిలవుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన డార్లింగ్ మరో సినిమా ఆది పురుష్. ఈ సినిమా గురించి దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తెలుగు సినీ పరిశ్రమలో రెబెల్‌స్టార్ అలియాస్ డార్లింగ్‌గా ప్రేక్షకుల మనస్సు చూరగొన్న ప్రభాస్..బాహుబలి సినిమాతో బాలీవుడ్‌కు చేరువయ్యాడు. ముఖ్యంగా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ముంబైలో నివాసం కూడా ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా జనవరి 14 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. డార్గింగ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ప్రభాస్ అప్‌కమింగ్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్( Adipurush). బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరెకెక్కిస్తున్న ఈ సినిమా మైథలాజికల్ నేపధ్యంతో తీస్తున్న సినిమా. ఈ సినిమాలో ప్రభాస్..రాముడిగా, కృతిసనన్..సీతగా, సైఫ్ అలీఖాన్..రావణుడిగా, సన్నీసింగ్..లక్ష్మణుడిగా నటిస్తున్నారు. 2022, ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది.కేవలం 103 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓం రౌత్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఓం రౌత్ వెల్లడించిన విషయాల్ని బట్టి..బాలీవుడ్‌లో ప్రభాస్ ఇమేజ్ ఎలా ఉందనేది అర్దం చేసుకోవచ్చు.
7 వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణ గాధను తనదైన కోణంలో చూపించబోతున్నట్టు ఓం రౌత్ (Om Raut) వెల్లడించాడు. అంత పెద్ద రామాయణాన్ని మూడు గంటల్లో చూపించడం కష్టం కాబట్టి..ఓ కీలక భాగాన్ని మాత్రమే చూపిస్తున్నామన్నాడు. అదెలాగుంటుందనేది మాటల్లో చెప్పడం కష్టమని...సినిమాలోనే చూడాలన్నాడు. ఆదిపురుష్ కధ రాసుకున్న తరువాత రాముడిగా తాను బాగా కన్పించాలని ప్రభాస్ చెప్పినట్టు దర్శకుడు ఓ రౌత్ తెలిపాడు. ఆ పాత్రకు అంటే రాముడి పాత్రకు ప్రభాస్ ఒక్కడే సరిపోతాడని తాను భావించినట్టు చెప్పాడు. రాముడి పాత్ర చేయాలంటే స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని వ్యక్తిత్వం ఉండాలని..అవన్నీ ప్రభాస్‌లో కన్పించాయంటున్నాడు ఓం రౌత్. కధ విన్న తరువాత ప్రభాస్ ఒకవేళ నో చెప్పి ఉంటే స్క్రిప్ట్ కూడా పక్కనపెట్టేసి ఉండేవాడినని దర్శకుడు ఓం రౌత్ మనసులో మాట వెల్లడించాడు. అంటే ఈ లెక్కన ప్రభాస్ (Prabhas)కాదని ఉంటే..మరో ఆదిపురుష్ సినిమా వచ్చుండేది కాదు.
Also read : Chiru Thanks to KCR: సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి.. సీఎం కేసీఆర్ కు మెగాస్టార్ కృతజ్ఞతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి