టీఆర్పీల కోసం పెళ్లి చేస్తారా.. ఉదిత్ నారాయణ్‌పై ట్రోలింగ్!

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్ ఆదిత్య నారాయణ్, నేహా కక్కర్‌లు గోవా టూర్ వెళ్లి వచ్చారని, ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

Updated: Feb 12, 2020, 02:12 PM IST
టీఆర్పీల కోసం పెళ్లి చేస్తారా.. ఉదిత్ నారాయణ్‌పై ట్రోలింగ్!

ముంబై: టీఆర్పీలు ప్రముఖులు, సెలబ్రిటీలతో ఏ పనైనా చేపిస్తుంటాయి. పెళ్లయి పిల్లలున్నా ఆ విషయం చెబితే లేడీ హోస్ట్‌లతో రొమాన్స్ పండదని దాచిపెట్టేవాళ్లు ఉన్నారు. అలాగే తమ లవ్ రిలేషన్, పెళ్లి లాంటివి బుల్లితెర, వెండితెర ఈవెంట్లలో చర్చించకుండా గోప్యంగా తమ పని చక్కబెట్టుసుకునే వాళ్లకు లోటేం లేదు. ఇప్పుడీ విషయం ఎందుకంటారా... ప్రముఖ గాయకుడు  ఉదిత్ నారాయణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అదంతా తాను కావాలని చేసిన గిమ్మిక్ అంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు.

ఫొటో గ్యాలరీ: భారత్‌కు వచ్చిన మరో విదేశీ అందం అదితి

ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ కూడా సింగరే. ఆదిత్య హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ‘ఇండియన్ ఐడల్’ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత నెలలో భార్యతో కలిసి ఆ షోకు హాజరయ్యాడు ఉదిత్ నారాయణ్. ఆదిత్యను నేహా కక్కర్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నామని షోలో వెల్లడించేసరికి షాకవ్వడం ఆడియన్స్ వంతయింది. షో జడ్జ్ నేహా కక్కర్ కూడా అవాకక్కైంది. వారిద్దరూ గోవా టూర్ వెళ్లి వచ్చారని, ఫిబ్రవరి 14న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని ఉదిత్ నారాయణ్ చెప్పారు. ప్రముఖ వ్యక్తి కనుక ఆయన చెప్పిన విషయాన్ని దాదాపు అందరూ నమ్మేశారు.

Also Read: నెటిజన్ ‘పెంట’ కామెంట్‌పై అనసూయ ఏమన్నారంటే!

తాను చెప్పింది అబద్దమని సింగర్ ఉదిత్ నారాయణ్ మీడియాతో వెల్లడించారు. ఆదిత్య, నేహా కక్కర్‌లు పెళ్లి చేసుకోనున్నారన్నది నిజం కాదని స్పష్టం చేశారు. కేవలం టీఆర్పీల కోసమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నారు. వీరిద్దరూ జడ్జీలుగా చేస్తున్న షోకు ప్లస్ పాయింట్ కావాలని భావించినట్లు తెలిపారు. అయితే ఆదిత్యకు పెళ్లి చేయాలని తాను, తన భార్య అనుకున్నది నిజమేనని.. ఈ వదంతులు నిజమైతే బాగుండునని చెప్పడం గమనార్హం. టీఆర్పీల కోసం ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..