Music Shop Murthy Movie Updates: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించగా.. శివ పాలడుగు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. జూన్ 14న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. డైరెక్టర్ శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొస్తూ.. తమది విజయవాడ అని.. అమెరికాలో ఉద్యోగం చేశానని చెప్పారు. అక్కడే తనకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడని.. అక్కడే డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశానని అన్నారు. తనకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చిందని.. తన స్నేహితులు ప్రొడ్యూసర్స్ కావడంతో అంతా ఈజీగా జరిగిపోయిందన్నారు.
Also Read: Jr NTR: బాబు ప్రమాణ స్వీకారోత్సవానికీ జూనియర్ ఎన్టీఆర్ ను పిలవలేదా..? పిలిచినా రాలేదా..?
25 కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుందని.. కొత్తగా ఉండాలనే మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ కథను రాసుకున్నట్లు చెప్పారు శివ పాలడుగు. ఈ స్టోరీకి అజయ్ ఘోష్ అయితే బాగుంటుందని అనుకున్నానని.. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ పాత్ర వేయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా అనుకున్న సమయంలో పుష్ప ఇంకా రాలేదని.. కానీ ఆయన ఈ పాత్ర పోషిస్తారని ముందే అనుకున్నానని చెప్పారు. ఈ సినిమా చాందినీ చౌదరి పాత్రలో ప్రారంభం అవుతుందని.. ఆమె క్యారెక్టర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్నారు. అంజన పాత్రలో ఆమె అద్భుతంగా నటించారని.. ఈ సినిమాలో తగిన పాత్ర దొరికిందన్నారు.
ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశామని.. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధన చేసినట్లు శివ పాలడుగు తెలిపారు. ఈ సినిమాకు పవన్ మంచి మ్యూజిక్ అందించారని.. అన్ని సాంగ్స్ సందర్భానుసారంగా వస్తాయన్నారు. మూవీ బడ్జెట్ విషయంలో ఎలాంటి సమస్యలు రాలేదని.. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదన్నారు. అయితే సినిమా తీయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విడుదల చేయడం, ప్రమోషన్స్ చాలా కష్టంగా అనిపించిందని అన్నారు. మొత్తానికి జూన్ 14న విడుదల కానుండడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కంటెంట్ ఉండి ఎమోషన్స్‌తోపాటు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న సినిమాలే పెద్ద విజయాలను సాధిస్తాయన్నారు శివ. తమ సినిమాలో కంటెంట్, ఎమోషన్స్ మీద తనకు నమ్మకం ఉందని.. ఆడియన్స్ అందరికీ నచ్చుతుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుందన్నారు. ఈ సినిమా విజయం తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేయనున్నట్లు వెల్లడించారు.
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter