Kannappa: కన్నప్పలో మరో బాలీవుడ్ హీరో... అంచనాలు పెంచేస్తోన్న సినిమా

Manchu Vishnu Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే భారీ తారాగణంతో నిండిపోయిన ఈ చిత్రంలో ఇప్పుడు కొత్తగా ఓ బాలీవుడ్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 8, 2024, 01:51 PM IST
Kannappa: కన్నప్పలో మరో బాలీవుడ్ హీరో... అంచనాలు పెంచేస్తోన్న సినిమా

Akshay Kumar in Kannappa: మంచు విష్ణు ఎప్పటినుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తాపత్రయ పడుతున్నారు. ఎట్టకేలకు రీసెంట్ గా తన కలను నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు. లార్జ్ స్కేల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం బడ్జెట్ రాను రాను పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించే ఈ చిత్రం కి ది బ్రేవెస్ట్‌ వారియర్‌, ది అల్టిమేట్‌ డీవోటి అనే ఇంట్రెస్టింగ్ టాగ్ లైన్స్ ని కూడా యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు.

వాస్తవానికి భక్తకన్నప్ప చరిత్ర జరిగిన ప్రదేశం తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. కానీ థాయిలాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలలో మంచు విష్ణు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ నిర్వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శరత్ కుమార్, శివ రాజ్‌కుమార్, మధూ, దేవరాజ్, ప్రీతి ముకుందాన్ లాంటి భారీ తారాగణం ఉన్నట్లు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరికి ఓ బాలీవుడ్ స్టార్ కూడా యాడ్ అవ్వనున్నట్టు టాక్. దీంతో మూవీ బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. 

ఇప్పటికే కన్నప్ప సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న తారాగణం ఆ అంచనాలను మరింత పెంచుతోంది. ఇంతకీ ఈ మూవీలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో కాదు.. అక్షయ్ కుమార్. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీలో అతను నటించే పాత్ర చిన్నదే కానీ చిత్రంపై దాని ప్రభావం మాత్రం గట్టిగా ఉంటుందని టాక్. అయితే ఇంకా అతని పాత్ర ఏమిటి అన్న విషయంపై స్పష్టత లేదు.కన్నప్ప చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మికంగా భావిస్తున్న మంచు విష్ణు స్టార్ కాస్టింగ్ దగ్గర నుంచి లొకేషన్స్ వరకు.. కెమెరామెన్ దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ వరకు ఎక్కడా ఖర్చుకు వెనకాడడం లేదు.

కన్నప్ప మూవీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో మూడు తరాలకు సంబంధించిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నారు. మోహన్ బాబు ,మంచు విష్ణు తో పాటు ఈ చిత్రంలో విష్ణు కొడుకు అవ్రామ్ కూడా నటించబోతున్నాడు. ఇది అతని డెబ్యు మూవీ కావడంతో ఈ చిత్రం మంచు కుటుంబానికి మరింత ముఖ్యమైనది. అందుకే క్రమంగా  ఒక్కొక్క అప్డేట్ విడుదల చేస్తూ రోజురోజుకీ ప్రేక్షకులలో ఈ చిత్రం పై ఆసక్తిని విపరీతంగా పెంచేస్తున్నారు చిత్ర బృందం.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News