Ranbir Alia Wedding: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ (Ranbir Alia Love Story) త్వరలోనే శుభవార్త వినిపించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజస్థాన్‌లోని ఓ ప్యాలస్ వేదిక ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరగుతున్నాయట!
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ - అలియా భట్ (Ranbir Alia Age Difference) కలిసి 'బ్రహ్మస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ను త్వరగా ముగించి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారట. దీంతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న 'అనిమల్' సినిమా షూటింగ్‌ను (Animal Movie Shooting) వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి విషయమై త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశముంది.
అలియా భట్ నటిస్తున్న (Aliabhatt RRR movie).. 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయ్ కతియావాడి' (Gangubai Kathiawadi Release Date) చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో పాటే 'డార్లింగ్స్', 'రాకీ ఔర్ రానీ కీ ప్రేమ్ కహాని'లో అలియా నటిస్తోంది. మరోవైపు, రణ్‌బీర్.. 'షంషేరా' చిత్రం (Shamshera Release Date) కూడా త్వరలోనే విడుదల కానుంది.
Also Read: RRR Movie Teaser Release Date: 'ఆర్ఆర్ఆర్' టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు?
Also Read: Varudu Kaavalenu Movie Promotions: 'వరుడు కావలెను' మూవీ ప్రమోషన్స్.. ఇలా కూడా చేస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.