Allari Naresh Ugram Movie Pre Release Business: కామెడీ సినిమాల హీరోగా పేరు ఉన్న అల్లరి నరేష్ నాంది సినిమాతో ఒకసారిగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంతకంటే ముందే ఆయన నటుడిగా ప్రూవ్ చేసుకున్న సినిమాలు చేసినా సరే నాంది సినిమా హిట్ అవడంతో ఆయనకున్న కామెడీ హీరో అనే ఇమేజ్ కాస్త చెదిరినట్టు అయింది. ఇప్పుడు ఆ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ ఉగ్రం అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. అల్లరి నరేష్ హీరోగా మిర్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్స్ కౌంట్ ఎలా ఉంది? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత వరకు జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Also Read: Samantha Tattoos:చైతూతో విడిపోయినా దాన్ని వదలని సమంత..అలా బయట పడిందిగా!
ముందుగా థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతంలో 110 థియేటర్లు, సీడెడ్ ప్రాంతంలో 45 థియేటర్లు, ఆంధ్ర ప్రాంతంలో 165 థియేటర్లు దొరికాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 325 థియేటర్లు దొరికినట్లు అయింది. ఇక కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 45 థియేటర్లు దొరకగా ఓవర్సీస్ లో 150 థియేటర్లు దొరికాయి. ఈ సినిమాకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 515 ధియేటర్లు దొరికినట్లు అయింది.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక మిగతా భారతదేశం ఓవర్సీస్ కలిపి మొత్తం ఆరు కోట్ల రూపాయల మేర హక్కులు అమ్ముడయ్యాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 6 కోట్ల 50 లక్షల నిర్ణయించారు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం అనే సినిమా కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ ని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రామబాణం సినిమా కంటే ఈ ఉగ్రం సినిమా మీదనే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుబోతుంది అనేది.
Also Read: Sarath Babu Death: శరత్ బాబు మృతి అంటూ ప్రచారం.. 'చంపకండి' అంటున్న నటుడి సోదరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook