Allu Arjun on Pushpa The Rule : ఇది కూడా అప్డేటేనా?.. అల్లు అర్జున్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Allu Arjun on Pushpa The Rule అల్లు అర్జున్ నిన్న తన తమ్ముడు అల్లు శిరీష్ సినిమా సక్సెస్ ఈవెంట్లో సందడి చేశాడు. అక్కడే పుష్ప పార్ట్ 2 మీద రియాక్ట్ అయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 04:47 PM IST
  • హిట్ కొట్టేసిన అల్లు శిరీష్‌
  • ఊర్వశివో రాక్షసివో సక్సెస్ ఈవెంట్
  • పుష్ప అప్డేట్ ఇచ్చిన బన్నీ
Allu Arjun on Pushpa The Rule : ఇది కూడా అప్డేటేనా?.. అల్లు అర్జున్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Allu Arjun on Pushpa The Rule :  అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ మీద ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ ముహూర్తపు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. సుకుమార్ అయితే ఈ రెండో పార్ట్‌ను ఇంకా చెక్కుతూనే ఉన్నాడట. ఎన్టీఆర్ పులితో పోరాడితే.. బన్నీ కోసం సింహం ఫైట్ పెట్టాడని తెలుస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ అనుకున్నదానికంటే ఎక్కువ హిట్ అవ్వడం, నార్త్‌లో విపరీతంగా డిమాండ్ రావడంతో ఈ సినిమాను మరో స్థాయిలో తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

ఈ క్రమంలోనే సినిమాను కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఇంత వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కనీసం షూటింగ్ ఎప్పుడు అనే దాని మీద కూడా స్పష్టత లేకుండాపోయింది. అలాంటి ఈ తరుణంలో బన్నీ తన ఫ్యాన్స్‌ను ఊరించాడు. అంతలోనే ఉసూర్మనిపించాడు. అల్లు శిరీష్‌కు లేక లేక ఓ హిట్ వచ్చిన సంగతి తెలిసింది. ఊర్వశివో రాక్షసివో అనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ అది కలెక్షన్ల మీద ప్రభావం చూపించడం లేదు.

అయినా అల్లు శిరీష్ స్థాయికి ఊర్వశివో రాక్షసివో సినిమా ఎడారిలో ఒయాసిస్ వంటిది. ఈ సినిమాను అల్లు ఫ్యామిలీ బాగానే సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో బన్నీ వాస్ ఇచ్చిన స్పీచు, అల్లు అర్జున్ గురించి చెప్పిన తీరు.. అల్లు శిరీష్ మాటలకు బన్నీ కంటతడి పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. స్టేజ్ మీద బన్నీ మాట్లాడుతూ.. పుష్ప రెండో పార్ట్ అప్డేట్ ఇస్తాను అని చెప్పి అందరినీ బక్రాలను చేసేశాడు.

పుష్పలో తగ్గేదేలే అంటే.. రెండో పార్టులో అసల్ తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుందట. ఇదే అప్డేట్ అంట. దీన్ని చూసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి ఇది కూడా అప్డేటా? అన్నట్టుగా ఆశ్చర్యపోతోన్నారు జనాలు. మరి ఈ మూవీ షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

Also Read : Singer MM Manasi : రష్మికను పక్కన నెట్టేసిన సింగర్.. హైలెట్ అయిన మానసి

Also Read : Jabardasth Varsha: ఓర చూపులతో జబర్దస్త్ వర్ష వల.. మొత్తం కప్పేసుందిగా..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News