Pushpa 2 New Poster: హీరో, విలన్ మధ్య బీభత్సం..పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల..

Pushpa 2 Update: పుష్ప సినిమా ఎంతటి.. విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి చోటు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న.. ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విరుదల కానుంది.  

Written by - Vishnupriya | Last Updated : Nov 5, 2024, 01:57 PM IST
Pushpa 2 New Poster: హీరో, విలన్ మధ్య బీభత్సం..పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల..

30 days to go for Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా.. హీరో అల్లు అర్జున్కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీయర్ లోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలవడమే కాకుండా.. ఈ హీరోకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది.

Add Zee News as a Preferred Source

ఈ చిత్రంలోని అల్లు అర్జున్ క్యారెక్టర్.. మాస్ ఆడియన్స్ కి మరింత చేరువయ్యింది. అంతేకాకుండా హిందీ ప్రేక్షకులకు సైతం ఈ సినిమాతో అల్లు స్టార్ హీరోగా మారారు. ఇక మొదటి భాగం చివర్లోనే ఈ సినిమా రెండో భాగం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా ఈ చిత్రం రెండో భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ రెండో భాగం ఈ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ముందుగా డిసెంబర్ 6న విడుదలవుతుంది అని చెప్పగా.. అది కాస్త ప్రీపోన్ అయ్యి ఇప్పుడు డిసెంబర్ 5న విడుదలవుతోంది. ఇక విడుదల తేదీకి కేవలం ఒక నెల మాత్రమే ఉండడంతో..ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు సినిమా యూనిట్.మొదటిసారి హీరో, విలన్ ఇద్దరు కలిసున్న పోస్టర్ని విడుదల చేయడం గమనార్హం. ఈ పోస్టర్లో ఒకరినొకరు చూసుకుంటూ.. ఇద్దరు ఎంతో పవర్ఫుల్ గా కనిపించారు. వెనక గంధపు చెక్కలు.. ఎర్రటి రంగులో కనిపిస్తూ.. ఈ చిత్రం పుష్ప మొదటి భాగానికి ఏమాత్రం తీసిపోదని.. ముందుగానే హింట్ ఇచ్చారు దర్శకుడు.

ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొదటి భాగంలో సమంత ఐటమ్ చేయగా ఇప్పుడు రెండో భాగంలో శ్రీ లీలా చేస్తుంది అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.  అంతేకాకుండా ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్టు కూడా సమాచారం. మరోపక్క ఈ ఐటమ్ సాంగ్ లో కాసేపు సమంత కూడా కనిపిస్తుంది అనే వార్త వినిపించింది. అయితే ఈ వార్తలో మాత్రం ఎటువంటి నిజం లేదు అని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

 

 

 

 ఇదీ చదవండి: America Elections 2024: అమెరికా ఎన్నికలు నవంబర్ మొదటి మంగళవారమే ఎందుకు నిర్వహిస్తారు? అసలు కారణం ఇదే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News