Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరో

Allu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం.. అల్లు అర్జున్ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 1, 2024, 12:08 PM IST
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరో

Allu Arjun Upcoming Movie: పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తాజాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదలకి సిద్ధం అవుతుంది. కాగా ప్రస్తుతం బన్నీ చేతిలో కొన్ని బడా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో త్రివిక్రమ్ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించిన ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. అదేమిటి అంటే ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో.. కొద్దిరోజులపాటు మీడియాకి దూరంగా ఉంటున్నారీ త్రివిక్రమ్. ఈ క్రమంలో ఇప్పుడు బన్నీ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. ఫాంటసీ టచ్ కూడా ఉండే ఒక భారీ సబ్జెక్టుతో ఈ సినిమా రెడీ అవుతోంది అని వినికిడి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి కూడా విశ్వంభర సినిమాతో ఫాంటసీ కాన్సెప్ట్ ని టచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు హీరో కూడా ఇదే ఫాలో అవుతూ తన తదుపరి సినిమాలో ఫాంటసీ కథలు తీసుకోబోతున్నారు. ఇద్దరికీ ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

అల్లు అర్జున్ నటిస్తున్న రెండు పాత్రలు ఒకదానికి ఒక దానితో మరొకటి పొంతన లేకుండా ఉంటాయని సమాచారం. ఇక సినిమాలో ఉండే కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్.. ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో కూడా.. ఒక సినిమా సైన్ చేశారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ తో కూడా.. బన్నీ సినిమా చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందు.. త్రివిక్రమ్ సినిమానే పూర్తి చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారట

Also Read: Anantapur Navodaya Old Students: మీరు నిజంగా గ్రేట్.. గురుదక్షిణగా రూ. 12 లక్షల కారు..

Also Read: Glass Symbol: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు 'గాజు గ్లాస్‌' గుర్తు కేటాయింపు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News