Amala Paul Baby Bump: తన బేబి బంప్ ఫోటోలతో అమలా పాల్ హల్‌చల్..

Amala Paul Baby Bump: అమలా పాల్ తెలుగులో నటించింది కొన్ని చిత్రాలే అయినా.. తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా గర్భంతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2024, 06:16 PM IST
Amala Paul Baby Bump: తన బేబి బంప్ ఫోటోలతో అమలా పాల్ హల్‌చల్..

Amala Paul Baby Bump: అమలా పాల్  సినిమాలతో పాటు తన బిహేవియర్‌తో వార్తల్లో నిలవడం ఆమె స్టైల్. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో రామ్ చరణ్ సరసన 'నాయక్', అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో నటించింది. కానీ టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే కేవలం తమిళం, మలయాళ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ సక్సెస్ అయింది.

ఆ మధ్య ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు మధ్య మనస్పర్ధలతో విడిపోయారు.  ముందుగా ఏ.ఎల్. విజయ్ మరో పెళ్లి చేసుకోగా.. అమలా పాల్ గతేడాది చివర్లో తన సహ నటుడు జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో జగత్ దేశాయ్‌తో ఈమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లైన మూడు నాలుగు నెలలకే తను గర్భవతి అన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు బేబి బంప్‌తో ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఇక తెలుగులో ఈ భామ  నటించింది కొన్ని సినిమాలే అయినా.. మెగా భామగానే అభిమానులు గుర్తు పెట్టుకున్నారు. ఈమె కేవలం సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఆ మధ్య 'ఆడై' సినిమాలో నగ్నంగా నటించి సంచలనం రేపింది. అంతేకాదు 'పిట్ట కథలు' వెబ్ సిరీస్‌లో హాట్ సీన్స్‌లో నటించి మెప్పించింది. మొత్తంగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి మొహమాటం లేకుండా నటించడం అమలాపాల్ స్టైల్. తాజాగా ఈమె రెండో పెళ్లి చేసుకొని మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తోంది.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News