This Month Theatrical Releases: తెలుగు సినిమాలకి ఫిబ్రవరి సెంటిమెంట్.. ఈసారి కూడా రిపీట్ కానుందా!!

Telugu Movies: ఫిబ్రవరి నెలకి బాక్సాఫీస్ లెక్కలకి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల సందడి తగ్గి.. సమ్మర్ సినిమాల హడావిడి షురూ కావడానికి మధ్యలో వచ్చే గ్యాప్ సీజన్ ఫిబ్రవరి సీజన్. మరి ఈ సీజన్లో గత కొద్ది కాలంగా తప్పని ఒక లెక్క మెయింటైన్ అవుతూ వస్తుంది. మరి అదేమిటో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 01:51 PM IST
This Month Theatrical Releases: తెలుగు సినిమాలకి ఫిబ్రవరి సెంటిమెంట్.. ఈసారి కూడా రిపీట్ కానుందా!!

Ambajipeta Marriage Brand: సంక్రాంతికి .. సమ్మర్ కి మధ్య వచ్చే ఈ సంధి కాలంలో విడుదలైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకోని సక్సెస్ ని సాధించిన సందర్భాలు ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిబ్రవరి మ్యాజిక్ కొనసాగుతూనే ఉంది. 2020లో ఫిబ్రవరి నెలలో విడుదలైన నితిన్ భీష్మ చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. సరి అయిన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న నితిన్ ఖాతాలో భీష్మ ఎటువంటి రికార్డ్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో ఉప్పెన బాక్సాఫీస్ ని ఉప్పెనలా ముంచేసింది.

ఆ తర్వాత 2022 ఫిబ్రవరి లో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లూ తో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేశాడో అందరికి తెలుసు.. మొన్న ఫిబ్రవరి లో వచ్చిన ధనుష్ సార్ మూవీ ఊహించని విజయాన్నందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఫిబ్రవరి నెలలో విడుదల కాబోయే చిత్రాల లో సక్సెస్ ఏ చిత్రాన్ని వరిస్తుందో చూడాలి. ఇక ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల లిస్ట్ ఏమిటో తెలుసుకుందాం..

ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలో చిన్న సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తోంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బూట్ కట్ బాలరాజు, ధీర, హ్యాపీ ఎండింగ్ లాంటి చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటన్నిటిలోకి సుహాస్.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. నెక్స్ట్ వీక్ యాత్ర-2, ఈగల్, లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. పొలిటికల్ సీజన్ కాబట్టి రాజకీయ నేపథ్యంతో తీసిన యాత్ర 2 మూవీ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలాగే సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజ ఈగల్ చిత్రం సోలో గా ఫిబ్రవరి 9 న వస్తోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ కి గట్టిగానే ప్రచారం జరుగుతుంది.మరో పక్క రజనీకాంత్ ఒక కీలక పాత్ర పోషించిన లాల్ సలామ్ మూవీ కూడా ఇదే నెల వస్తోంది. ఉన్నవి చాలవు అన్నట్లు పవన్ కల్యాణ్ 2012 లో నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు మూవీ ఇదే నెల రీ-రిలీజ్ కాబోతోంది.

ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఆపరేషన్ వాలంటైన్, ఊరు పేరు భైరవకోన సినిమాలు ఉండనే ఉన్నాయి. ఈ రెండు మూవీలలో కాస్త థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఊరి పేరు భైరవకోన మూవీ పై అంచనాలు బాగున్నాయి. ఇక ఫిబ్రవరి 4వ వారంలో సుందరం మాస్టారు ,మస్తు షేడ్స్ ఇలాంటి చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ అవుతున్నాయి. మొత్తం మీద ఈనెల లెక్క తన ఖాతాలో వేసుకునే మూవీ ఏదో చూడాలి.

Also read:  TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!

Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x