Jawan first Single: 'షారుఖ్ ఏజ్ రోజురోజుకూ తగ్గిపోతుంది'.. జవాన్ ఫ‌స్ట్ సింగిల్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్

Jawan Movie: షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయగా.. దానికి షారుఖ్ స్వీట్ రిప్లై ఇచ్చారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 05:39 PM IST
Jawan first Single: 'షారుఖ్ ఏజ్ రోజురోజుకూ తగ్గిపోతుంది'.. జవాన్ ఫ‌స్ట్ సింగిల్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్

Jawan first Single: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న మూవీ 'జవాన్' (Jawan Movie). నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'జిందా బందా..' అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ పాటపై స్పందించారు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). ''షారుఖ్ వయసు 57 ఇయ‌ర్స్‌లాగా లేదు. అతడి వయసు రోజురోజుకూ తగ్గిపోతుంది. యువకుల కంటే 10 రెట్లు ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తున్నాడంటూ'' మహీంద్రా ట్వీట్ చేశారు. దీనికి షారుక్ కూడా రిప్లై ఇచ్చారు. 

''ఆనంద్ మహీంద్రా సర్.. లైఫ్ చాలా చిన్నది. తొందరగా గడిచిపోతుంది. దానితో పాటు మనం పోటీ పడాలి. ఎంత మందిని ఎంటర్‌టైన్‌ చేయగలిగితే అంతమందిని ఎంటర్‌టైన్ చేయాలి. దాని కోసం న‌వ్వాలి, ఏడవాలి, క‌ద‌లాలి, ఎగ‌రాలి, వీలు అయితే న‌క్షత్రాల‌తో క‌లిసి ఈత కొట్టాలి. అలాంటి ఆనందపు క్షణాల గురించి కల‌లు కనాలంటూ''షారుఖ్ ఖాన్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Also Read: Nitin Desai death: లగాన్, జోధా అక్బర్ చిత్రాల ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ కన్నుమూత  

ఈ పాటను అనిరుధ్ స్వయంగా స్వరపరచి అలపించారు కూడా. దీనికి సాహిత్యాన్ని చంద్రబోస్ అందించారు. ఈ పాట కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. విజువల్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా, గెస్ట్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కనిపించబోతున్నారు. 

Also Read: Sardar 2 update: బిజీ బిజీగా కార్తీ.. సర్దార్‌ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News