Art director Nitin Desai Passes away: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్(Nitin Desai) కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబై సమీపంలోని కర్జాత్‌లో గల తన ఎన్‌డి స్టూడియోలో శవమై కనిపించాడు. అతని మరణానికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
నితిన్ దేశాయ్ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అతను బాలీవుడ్‌లో అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా మరియు సంజయ్ లీలా బన్సాలీ వంటి దిగ్గజ దర్శకులతో కలిసి పవిచేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, జోధా అక్బర్, లగాన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై మరియు బాజీరావ్ మస్తానీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నితిన్ భాగం పంచుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అతని చివరి ప్రాజెక్ట్ అశుతోష్ గోవారికర్‌తో 2019లో వచ్చిన పానిపట్. ఈయన హాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక ఆర్ట్ డైరెక్టర్స్ గిల్డ్ ఫిల్మ్ సొసైటీ మరియు అమెరికన్ సినిమాథెక్ చేత సత్కరించబడ్డాడు.
Also Read: Karthik Aaryan: పారాలింపిక్ ఛాంపియన్ బయోపిక్‌లో కార్తిక్ ఆర్యన్.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్..
ఆర్డ్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాత గానూ నితిన్ కొన్ని చిత్రాలను నిర్మించాడు. 2003లో దేశ్ దేవి మా ఆశపురా చిత్రంతో నిర్మాతగా అవతారమెత్తాడు. ఫేమస్ మరాఠీ సీరియల్ రాజా శివఛత్రపతిని కూడా నిర్మించింది నితినే. 2005లో నితిన్ ముంబై శివార్లలోని కర్జాత్‌లో ND స్టూడియోస్‌ను ప్రారంభించాడు. 52 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టూడియో అనేక సినిమా సెట్‌లకు గమ్యస్థానంగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook