Anchor Anasuya: నాకు నచ్చిన విధంగా నేను ఉన్నా.. నచ్చకపోతే దూరంగా ఉండండి: యాంకర్ అనసూయ ఘాటు రిప్లై

Anasuya latest Tweets got Viral: యాంకర్ అనసూయ లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. తనను ట్రోల్ చేస్తున్నవారితో మరోసారి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసింది. అనవసరంగా తాను పేరును వాడుకోవడంతో ఇబ్బంది పడుతున్నానని తెలిపింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 21, 2023, 07:36 PM IST
Anchor Anasuya: నాకు నచ్చిన విధంగా నేను ఉన్నా.. నచ్చకపోతే దూరంగా ఉండండి: యాంకర్ అనసూయ ఘాటు రిప్లై

Anchor Anasuya latest tweets got Viral in Social Media: యాంకరింగ్‌కు గుడ్‌ బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే నెట్టింట మాత్రం ఫుల్ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో వివాదానికి కూడా పుల్‌ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. "అందరికీ నమస్కారం.. నేను చేయవలసిన ఒక అభ్యర్థన.. కొన్ని రోజుల నుంచి నాకు చాలా ట్వీట్లు వస్తున్నాయి.. రాజకీయ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతరులను అగౌరవపరిచేందుకు నా పేరును తక్కువ చేసి వాడుతున్నారు. ఇది నాకు అగౌరవంగా ఉంది." అంటూ అనసూయ రాసుకొచ్చింది. 

తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నానని.. తాను జోలికి వెళ్లడం లేదని తెలిపింది అనసూయ. అది అనవసరమైన బాధను కలిగిస్తుందని చెప్పింది. ఈ సమస్యలతో తనకు ఎక్కడా సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను స్వశక్తితో ఎదిగానని.. తన గురించి గొప్పగా చెప్పే పీఆర్‌ టీమ్‌లుగానీ.. ఇతరులు గానీ ఎవరూ లేరని రాసుకొచ్చింది అనసూయ. తనను ప్రశంసించకపోయినా.. ప్రోత్సహించపోయినా కనీసం దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేసింది. 

సక్రమ మార్గంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇక్కడ ఉన్నానని.. తనకు ఓ కుటుంబం ఉందని అనసూయ తెలిపింది. "దయచేసి మీ సొంత ఆచరణాత్మక నిర్ణయాలను చర్చించడానికి మీకు సామర్థ్యం లేని విషయాల్లోకి పేరును లాగకుండా దయతో ఉండండి.. అత్యంత ధర్మబద్ధంగా నేను ఒక మార్పు కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాను. నాకు ఒక కుటుంబం ఉంది.. ప్లీజ్" అంటూ అనసూయ వరుసగా ట్వీట్లు చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో ట్విట్టర్ వార్‌పై ఇటీవల స్పందించిన అనసూయ.. ఇక ఆపేద్దామని అనుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇక నుంచి కెరీర్‌పై తాను దృష్టి పెడుతున్నట్లు వెల్లడించింది. మరోసారి అయినా నెట్టింట ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే అనసూయ వరుసగా ట్వీట్లు చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ ఏమైంది అనసూయ మేడమ్ అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. 

Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News