Actress Trisha's life turning point: స్టార్ హీరోయిన్ త్రిష తన నటనతో తెలుగు, తమిళంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. గత రెండు దశాబ్ధాల పాటు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో త్రిష ( Trisha ) కూడా ఒకరు. తన జీవితంలో సెప్టెంబర్ 30 అనేది ఒక మరచిపోలేని రోజు అని త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. 1999లో సెప్టెంబర్ 30న త్రిష కేవలం 16 ఏళ్ళ వయసులో ''మిస్ మద్రాస్ 1999' ( Miss Madras crown ) కిరీటాన్ని గెలుచుకున్నప్పటి ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, “నా జీవితాన్ని మార్చిన రోజు” అని ఆ రోజు ప్రాముఖ్యతను తెలిపింది. Also read : Mumbai Police: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు
త్రిష 'మిస్ చెన్నై' అయిన తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది. 1999లో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా కలిసి నటించిన జోడి ( Jodi movie ) చిత్రంలో ఒక చిన్న పాత్రతో వెండితెరపైకి ప్రవేశించి త్రిష.. ఆ తర్వాత సూర్యతో కలిసి 2002లో విడుదలైన 'మౌనం పెసియాధే' ( Mounam pesiyadhe ) చిత్రంతో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో ( Nee manasu naku telusu movie ) టాలివుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో 'వర్షం' సినిమాలో ప్రభాస్‌తో ( Prabhas ) కలిసి నటించి తెలుగునాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. Also read : R Madhavan about Pushpa: 'పుష్ప'లో విలన్ పాత్రపై స్పందించిన మాధవన్
అప్పటి నుండి త్రిష, తన రెండు దశాబ్దాల కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడనంతగా బిజీ అయింది. ఈ ఏడాది త్రిష 6 సినిమాలకు సైన్ చేయగా.. అందులో ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి కాగా మరో నాలుగు సినిమాలు త్రిష చేతిలో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe