Anjali-Balakrishna: బాలకృష్ణ గురించి అంజలి పోస్ట్.. ఫైనల్ గా స్టేజ్ ఇన్సిడెంట్ పై క్లారిటీ!

Balakrishna Anjali Incident: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. బాలకృష్ణ, అంజలి మధ్య జరిగిన సంఘటన ఎంతటి కాంట్రవర్సీకి దారితీసిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఇదే విషయంపై అంజలి స్పందించింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 31, 2024, 10:13 AM IST
Anjali-Balakrishna: బాలకృష్ణ గురించి అంజలి పోస్ట్.. ఫైనల్ గా స్టేజ్ ఇన్సిడెంట్ పై క్లారిటీ!

Anjali Reacts About Balakrishna Incident: విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి అంజలి హీరోయిన్లుగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే బాలకృష్ణ ఈ ఈవెంట్ లో సరదాగా చేసిన పని కాస్త చాలా కాంట్రవర్సీలకు దారితీసింది. అంజలితో బాలకృష్ణ ప్రవర్తనపై హిందీ సెలబ్రిటీస్ కూడా కొంతమంది మంది పడ్డారు. ఈ క్రమంలో విశ్వక్ అలానే నిర్మాత నాగవంశీ మాత్రం బాలకృష్ణను వెనకేసుకుని వచ్చారు. అయితే అంజలి ఈ విషయం గురించి నోరు తెరిచే దాకా.. దీనిపై క్లారిటీ రాదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఈ విషయంపై ఫైనల్ గా అంజలి స్పందించింది.

ఇంతకీ ఈవెంట్లో ఏమి జరిగిందంటే..ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలిపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టేజ్‌పై అంజలిని బాలయ్య పక్కకి నెట్టడం.. ఆ తరువాత కాసేపు కసురుకున్నట్టు మాట్లాడడం.. విమర్శలకి దారి తీసింది. అయితే ఆ తరువాత మళ్లీ బాలకృష్ణ, అంజలి ఎంతో నవ్వుకుంటూ హై-ఫై ఇచ్చుకున్నారు. ఇది నిజంగా బాలకృష్ణ తమాషాగా చేశారో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై ఎందరో మంది పడుతున్నారు. ఇక తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు..బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి..నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేమిద్దరం చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం నాకు అద్భుతంగా అనిపించింది." అంటూ బాలయ్యతో పాటు ఉన్న వీడియోను అంజలి పోస్ట్ చేశారు.

 

 

ఈ ట్విట్టర్ పోస్టు ద్వారా ఆ వైరల్ వీడియోపై ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు హీరోయిన్ అంజలి. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు కొంతమంది భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అయితే పోస్టు ఓకే కానీ అంతా అయిపోయాకా పోస్టు చేయడమే.. అస్సలు బాలేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొంతమంది అయితే అంజలి తప్పక ఈ పోస్టు పెట్టాల్సి వచ్చిందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. అయితే అంజలి బాలయ్య తోచినప్పుడు కూడా నవ్వుతూనే ఉండింది.. దీని గురించి కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది బాలకృష్ణ అక్కడ తమాషాగా పని చేయడం వల్లే అంజలి అలా నవ్వుతూ ఉండిందని అనగా.. మరి కొంతమంది మాత్రం అక్కడ అంజలి రియాక్ట్ అయ్యుంటే ఆమె కెరియర్ శుభం కార్డు పని ఉంటదని.. అందుకే నవ్వుతూ మేనేజ్ చేసింది అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: HHVM: ఒక్క సినిమాకి నలుగురు దర్శకులు..ఆందోళనలో పవన్ ఫ్యాన్స్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News