Sushant singh rajput: మీ సమస్యేంటి అసలు? సుశాంత్ అభిమానులపై అంకిత ఆగ్రహం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం ప్రతిరోజూ..రోజుకోవిధంగా చర్చకు దారి తీస్తోంది. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లొఖాండే ఇప్పుడు సుశాంత్ అబిమానులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆగ్రహానికి కారణమేంటి ?

Last Updated : Sep 29, 2020, 03:19 PM IST
Sushant singh rajput: మీ సమస్యేంటి అసలు? సుశాంత్ అభిమానులపై అంకిత ఆగ్రహం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) వ్యవహారం ప్రతిరోజూ..రోజుకోవిధంగా చర్చకు దారి తీస్తోంది. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లొఖాండే ( Ankita lokhande ) ఇప్పుడు సుశాంత్ అబిమానులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆగ్రహానికి కారణమేంటి ?

అసలు మీ ప్రోబ్లమ్ ఏంటి ( Whats wrong with you ) ? అలాంటి వీడియోలు పోస్ట్ చేయడం ఇక పై ఆపండి..అవి మా అందరికీ ఇబ్బంది కల్గిస్తున్నాయి. సుశాంత్ అభిమానుల్ని ఉద్దేశించి అంకితా లొఖాండే ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిిన ట్వీట్ ఇది. ఆమె ఎందుకింత ఆగ్రహం చెందింది..అది కూడా సుశాంత్ అభిమానులపై. 

ఇంతకీ అంకిత లొఖాండే ఆగ్రహానికి కారణమైన ఆ వీడియో ఏంటి..ఏముంది ఆ వీడియోలో. ముంబైలో జరిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంతిమక్రియల వీడియో అది. ఎవరో అభిమాని పోస్ట్ చేయగా...సోషల్ మీడియాలో అదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను వెంటనే తొలగించాల్సిందిగా అంకితా లొఖాండే ..సుశాంత్ అభిమానుల్ని( Sushant fans ) కోరారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తమందరికీ ఇవి ఇబ్బంది కల్గిస్తున్నాయన్నారు. సుశాంత్ పై మీకు ప్రేమ ఉండవచ్చు కానీ..ఆ ప్రేమను వ్యక్తపరిచే పద్ధతి ఇది కాదని కూడా హితవు పలికారు. 

పవిత్ర రిష్తా ( pavitra rishta ) సీరియల్ నుంచి దాదాపు ఆరేళ్ల పాటుత సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అంకితా లొఖాండేలు ప్రేమలో ఉన్నారు. అనంతరం బ్రేకప్ అయింది ఇద్దరికీ. అతని ఆత్మహత్య అనంతరం సుశాంత్ కుటుంబసభ్యులకు అండగా నిలిచారు అంకితా. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తితో కలిసి సుశాంత్ కు జ్ఞాపకార్ధం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా అంకితా పాల్గొంది. 

జూన్ 14వ తేదీన ముంబైలోని ఇంట్లో మరణించిన సుశాంత్ సింగ్ వ్యవహారం సంచలనమైంది. ఈ కేసును సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( narcotics control bureau ) లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. Also read: Sushant singh Rajput: హత్యనా..ఆత్మహత్యనా? తుది నివేదికలో అదే ఉందా?

Trending News