Reason for Nagarjuna Daggubati Lakshmi Divorce: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అక్కినేని నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడ. తన తండ్రి బాటలో కాకుండా ప్రత్యేక శైలిలో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. అయితే నాగార్జున తర్వాత అదే కుటుంబం నుంచి సుమంత్, సుశాంత్, సుప్రియ, నాగచైతన్య, అఖిల్ వంటి వారు కూడా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు.
నిజానికి నాగార్జునకు కొత్త వారందరికీ మంచి అవకాశాలు ఇస్తారన్న పేరుంది. అలాగే ఆయన చేసిన మన్మధుడు సినిమా పుణ్యమో లేక ఇండస్ట్రీలో ఉన్న గాసిప్స్ పుణ్యమో తెలియదు కానీ నాగార్జున రొమాంటిక్ ఫెలో అని చాలామంది హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉండేవి. ఇక ఆయన భార్య పేరు అమల అని చాలా మందికి తెలుసు కానీ అమల కంటే ముందే నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు సోదరుల సోదరిని వివాహం చేసుకున్నారు. దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని ముందుగా నాగార్జున వివాహం చేసుకున్నారు.
ఇదీ చదవండి: Samantha Face: సమంతది ముసలి ముఖం.. ఆమె శకుంతల ఏంటి.. నటుడు షాకింగ్ కామెంట్స్!
ఇది పెద్దలకుదురుచ్చిన వివాహం కావడం, నాగార్జున ఎందుకో లక్ష్మీ మీద ఆశక్తి చూపించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి విడాకుల వరకు వెళ్ళింది. అయితే అంతకు లోపే ఈ జంటకు నాగచైతన్య జన్మించారు. నాగచైతన్య జన్మించిన తర్వాత కొన్నాళ్లకు దగ్గుబాటి లక్ష్మి, నాగార్జున మధ్య దూరం పెరిగి ఆమె పూర్తిగా అమెరికా షిఫ్ట్ అయిపోతే నాగార్జున సినిమాల బిజీలో పడిపోయారు. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం నాగార్జున బిజీ షెడ్యూల్ అని చెబుతూ ఉంటారు.
లక్ష్మి సినీ కుటుంబం నుంచే వచ్చినా నాగార్జున తనకు సమయం వెచ్చించకపోవడంతో ఆమెకు నాగార్జునకు మధ్య దూరం పెరిగిందట. వారిద్దరి మధ్య దూరం పెరగటం ఆమె విడాకులు తీసుకున్న అమెరికా వెళ్ళిపోవడంతో నాగార్జున తనతో పాటు నటిస్తున్న అమలతో ప్రేమలో పడడం ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది.
ఇక అమల నాగార్జున దంపతులకు అఖిల్ జన్మించాడు. ఇక లెక్కల ప్రకారం నాగార్జున దగ్గుబాటి లక్ష్మీ వివాహం 1984లో జరగగా 1986లో నాగచైతన్య జన్మించాడు. 1990లో నాగార్జున లక్ష్మీ ఇద్దరూ విడిపోయారు, ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. ఇక ఆ తర్వాత తనతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అమలతో ప్రేమలో పడటం, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడం వంటి విషయాలు అందరికీ విదితమే.
ఇదీ చదవండి: Venkatesh Affairs: వెంకటేష్ పవిత్రుడేమీ కాడు.. వారితో ఎఫైర్లు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook