తెలుగు సినీ పరిశ్రమకు తీరని శోకం మిగుల్చుతూ కళాతపస్వి కే విశ్వనాథ్ తుది శ్వాస విడిచారు. విశ్వనాథ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దర్శక యశస్వికి నివాళులు అర్పిస్తున్నారు.
దర్శక యశస్వి కే విశ్వనాథ్ మరణవార్త తెలుగు రాష్ట్రాలకు, తెలుగు సినీ ప్రపంచానికి తీరని షాక్ ఇచ్చింది. విశ్వనాథ్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. కే విశ్వనాథ్ గారు కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని కొనియాడారు. విశ్వనాథ్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని..తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారని వైఎస్ జగన్ తెలిపారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు సినీ రంగానికి ఎనలేని గౌరవాన్ని అందించాయన్నారు.
మరోవైపు కే విశ్వనాథ్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతి సామాన్య కధను అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్యకావ్యంగా మలిచే అరుదైన దర్శకుడు కే విశ్వనాథ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. గతంలో ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంటికి వెళ్లి పరామర్శించానని.. ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై జరిగిన చర్చను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ గారి మరణం తీరని లోటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మరోవైపు కళాతపస్వి,. ప్రముఖ చలనచిత్ర దర్శకులు కే.విశ్వనాథ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కే.విశ్వనాథ్ మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు. శంకరాభరణం చిత్రంతో చిత్ర రంగం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహా గొప్ప నటుడు, దర్శకులు కే. విశ్వనాథ్ అని కొనియాడారు. ఆయన మరణంతో చిత్రరంగం చిన్నబోయిందని.. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి కలుగజేయాలని ప్రార్థిస్తున్నానన్నారు.
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook