Waltair Veerayya Pre Release Event: 'వాల్తేరు వీరయ్య' యూనిట్ కు షాక్.. ఆర్కే బీచ్లో అనుమతి లేదంటూ!

Shock to Waltair Veerayya Team: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకోగా ఇప్పుడు ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 5, 2023, 05:50 PM IST
Waltair Veerayya Pre Release Event: 'వాల్తేరు వీరయ్య' యూనిట్ కు షాక్.. ఆర్కే బీచ్లో అనుమతి లేదంటూ!

AP Government Shock to Waltair Veerayya Team: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి యూనిట్ కి షాక్ ఇవ్వగా యూనిట్ ముందుగా నిర్వహించాలనుకున్న ప్రాంతంలో కాకుండా మరోచోట తిరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ విడుదల చేయగా బహిరంగ సభలకు, రోడ్లపై ర్యాలీలకు కూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందిగా సర్కులర్లో పేర్కొన్నారు.

ఈ నేపద్యంలో వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతులు నిరాకరించడంతో ఒంగోలు మధ్యలో ఉన్న స్థలాన్ని కాకుండా శివారులో ఉన్న మరో స్థలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా యూనిట్ కి కూడా ఇప్పుడు తాజాగా షాక్ తగిలినట్టు అయింది. అసలు విషయం ఏమిటంటే ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఇక ఆర్కే బీచ్ లో స్టేజ్ పనులు ప్రారంభిస్తూ ఉండడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ పనులు నిలిపివేయాలని కోరారు. అధికారుల సూచనల మేరకు వెంటనే పనులు నిలిపివేయాల్సిందిగా పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణపై నిర్వాహకులు సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి ఒక అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా కుటుంబానికి చెందిన కొందరు కూడా రావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ శ్రీకాకుళం విజయనగరం మరోపక్క తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణాజిల్లాల నుంచి కూడా హాజరయ్యే అవకాశాలు ఉండడంతో పోలీసులు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. అయితే విశాఖపట్నం కేంద్రంగానే ఈ వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందించారు. విశాఖపట్నంలోని వాల్తేరు ప్రాంతం నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి యూనిట్ అయితే ప్లాన్ చేస్తోంది. ఏదైనా స్టేడియం లాంటి చోట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అయితే తుది నిర్ణయం వచ్చేవరకు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందనే దానిమీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Also Read: Sonu Sood Slammed: సోను సూద్ పని అయిపోయిందా? ఇదేం పనులంటూ విమర్శల వర్షం!

Also Read: Varasudu Preponed: ఒక రోజు ముందుకు వారసుడు సినిమా.. చివరి నిముషంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News