Dil Raju Love Today: అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. ఆ సూపర్ హిట్ మీద కన్ను.. తెలుగులో రిలీజ్!

Love Today Releasing in Telugu: తమిళంలో హిట్ గా నిలిచిన సినిమాను తెలుగులోకి అందుబాటులోకి తెస్తున్నారు దిల్ రాజు.  ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 8, 2022, 10:50 AM IST
Dil Raju Love Today: అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. ఆ సూపర్ హిట్ మీద కన్ను.. తెలుగులో రిలీజ్!

Tamil Love Today Releasing in Telugu on November 18th: ఇప్పటిదాకా హిట్ సినిమా ఎక్కడ ఉన్నా దాన్ని వెంటనే రీమేక్ చేసేస్తూ ఉండే వాళ్ళు మన తెలుగు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు మాత్రం ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఉండేందుకు దానిని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అందులో భాగంగానే అల్లు అరవింద్, దిల్ రాజు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అల్లు అరవింద్ గీతా ప్రొడక్షన్ 2 నేరుగా చేసిన సినిమాలు చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ లాంటి డిజాస్టర్ సినిమాలు తీశారు. ఈ మధ్య విడుదలైన ఊర్వశివే రాక్షసివే సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. దిల్ రాజుకు సంబంధించిన వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా నేరుగా చేసిన సినిమాలు థాంక్యూ, రౌడీ బాయ్స్, జాను వంటి సినిమాలు కూడా ఒక రకంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఇప్పుడు సేఫ్ సైడ్ గా ఉండేందుకు కొన్ని ఇతర భాషల సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. అల్లు అరవింద్ ఇటీవల కాంతారా సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. కమిషన్ బేసిస్ మీదే చేసినా ఆయనకు కూడా గట్టిగానే కమిషన్ మిగిలింది. ఇక మరో ప్రక్క దిల్ రాజు కూడా కేజిఎఫ్ చాప్టర్ 2, బీస్ట్, పొన్నియన్ సెల్వన్ 1 సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు తాజాగా దిల్ రాజు మరో తమిళ సూపర్ హిట్ సినిమా అని తెలుగులో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది.

నవంబర్ 4వ తేదీన తమిళనాడులో విడుదలైన లవ్ టుడే అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే గాక ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 18వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. మరో పక్క అల్లు అరవింద్ కూడా హిందీలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ భేడియా అనే సినిమాని తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ కృతి సనన్ జంటగా నటిస్తున్నారు.

Also Read: Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!

Also Read: Naga chaitanya - Samantha Divorce: సమంత, నాగచైతన్య విడాకులు రద్దు చేయిస్తున్న నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News