Artilce 370 1st Weekend Collections: 2019లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి వేరు చేస్తోన్న ఆర్టికల్ 370ని ఎంతో సాహోసోపేతంగా 2019 ఆగష్టు 5న పార్లమెంటులో ప్రవేశిపెట్టి తొలిగించింది. అంతేకాదు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని.. జమ్ము కశ్మీర్‌గా, లద్దాక్‌గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత 31 అక్టోబర్ 2019న సర్ధార్ పటేల్ జయంతి రోజున రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఎప్పుడు ఏదో ఒక గొడవతో సతమతమయ్యే అక్కడ ప్రాంత ప్రజలు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి ప్రాంతంతో పాటు ప్రజల్లో పెను మార్పులు వచ్చాయి.
ఇక కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు జమ్మూ కశ్మీర్‌లో చేస్తోన్న అభివృద్దిని చూస్తూ పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా POJKను మన దేశంలో విలీనం చేయాలంటూ ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో ఆర్టికల్ 370 పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో తీసుకున్న చర్యలు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
'యూరీ .. ది సర్జికల్ స్ట్రైక్' మూవీ డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ ఈ సినిమాను నిర్మించారు. ఈయనతో పాటు లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండే ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఆదిత్య జంబాలే ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో యామీ గౌతమ్, ప్రియమణితో పాటు అరుణ్ గోవిల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రబరి 23న విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
#Article370 SCORES BIG in its opening weekend… The growth on Day 2 and 3 was very much on the cards, but amassing a solid ₹ 25 cr+ in its weekend elevates it to the SUCCESS category… Fri 6.12 cr, Sat 9.08 cr, Sun 10.25 cr. Total: ₹ 25.45 cr. #India biz. #Boxoffice
Looking at… pic.twitter.com/9DGyJ7dUS3
— taran adarsh (@taran_adarsh) February 26, 2024
ఈ సినిమా తొలి రోజు.. శుక్రవారం.. రూ. 6.12 కోట్లు.. శని వారం.. రూ. 9.08 కోట్లు.. ఆదివారం.. రూ. 10.25 కోట్లు..మొత్తంగా రూ. 25.45 కోట్ల నెట్ వసూళ్లను మన దేశంలో రాబట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మొత్తంగా ఫస్ట్ డే కంటే రెండో రోజు, మూడో రోజు మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇక తెలుగులో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో 'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్' మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత ఇపుడు డైరెక్ట్‌గా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో వచ్చిన పూర్తి స్థాయి చిత్రం ఇదే కావడం గమనార్హం.
Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి