Arun Vijay Amy Jackson: లైకా చేతికి అరుణ్‌ విజయ్ సినిమా.. చాలా గ్యాప్‌తో రాబోతోన్న ఎమీ జాక్స‌న్‌

Mission Chapter 1 Rights: కోలీవుడ్ యాక్షన్ హీరో అరుణ్ విజయ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే మరో సినిమా రాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 05:30 PM IST
  • అరుణ్‌ విజయ్ సినిమా అప్డేట్
  • హక్కులు దక్కించుకున్న లైకా
  • చాలా గ్యాప్‌తో వస్తోన్న ఎమీ జాక్సన్
Arun Vijay Amy Jackson: లైకా చేతికి అరుణ్‌ విజయ్ సినిమా.. చాలా గ్యాప్‌తో రాబోతోన్న ఎమీ జాక్స‌న్‌

Arun Vijay Amy Jackson Movie: కోలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ కంపెనీగా దూసుకుపోతోంది లైకా. సుభాస్కరణ్ నిర్మించే భారీ చిత్రాలను చూసి సౌత్ అంతా ఫిదా అవుతుంటుంది. భారీ సినిమాలకు లైకా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది. కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా.. తమకు నచ్చిన, మెచ్చిన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అరుణ్ విజయ్ కొత్త సినిమా హక్కులను కొనేసింది లైకా సంస్థ. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

అరుణ్‌ విజయ్ ఎమీ జాక్సన్‌లు జంటగా నటిస్తున్న మిషన్ చాప్టర్ 1 సినిమాను ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించారు.  2.ఓ, పొన్నియిన్ సెల్వ‌న్, ఇండియన్ 2 వంటి చిత్రాలు స‌హా ఎన్నో భారీ చిత్రాల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ సినిమాను లైకా కొనేసింది. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల‌ చేయ‌టానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, ఆడియో, థియేట్రిక‌ల్ రిలీజ్‌కి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నట్టు లైకా తెలిపింది.

విజ‌య్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఈ సినిమా హీరో అరుణ్ విజ‌య్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇక మరో వైపు ఎమీ జాక్సన్ చాలా గ్యాప్ తరువాత తెరపైకి వస్తోంది.  2.ఓలో న‌టించిన ఎమీ జాక్సన్ మళ్లీ ఇన్నాళ్లకు ఇలా అరుణ్ విజయ్ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది.

జైలర్‌గా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. మలయాళీ నటి నిమిషా స‌జ‌య‌న్ సైతం ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. చెన్నైలో జైలు సెట్‌ను భారీ ఎత్తున నిర్మించారు. స్టంట్ సిల్వ  ఫైట్స్ హై ఓల్టేజ్‌లో ఉండబోతోన్నాయి. అసలే యాక్షన్ హీరోగా అరుణ్‌ విజయ్‌కు మంచి పేరున్న సంగతి తెలిసిందే.

Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News