Sai Rajesh: మరో చిత్రానికి సాయిరాజేష్ సపోర్ట్..డర్టీ ఫెలో నుంచి విడుదలైన సందెవేళ సాంగ్

Dirty Fellow: చిన్న సినిమాలకు ఎప్పుడు సపోర్ట్ గా నిలిచే బేబీ సినిమా దర్శకుడు సాయిరాజేష్.. తాజాగా డర్టీ ఫెలో అనే సినిమా నుంచి సందెవేళ సాంగ్ ని మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 05:09 PM IST
Sai Rajesh: మరో చిత్రానికి సాయిరాజేష్ సపోర్ట్..డర్టీ ఫెలో నుంచి విడుదలైన సందెవేళ సాంగ్

Dirty Fellow: హృదయ కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సాయి రాజేష్ ఆ తరువాత కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్య విడుదలైన బేబీ చిత్రానికి దర్శకత్వం వహించి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. తెలుగులో మంచి కథతో విడుదలయితే ఏ చిన్న సినిమాకైనా తన సపోర్ట్ అందిస్తాను అంటూ ముందుకు వచ్చే ఈ దర్శకుడు ఇప్పుడు మరో చిత్రానికి తన వంతు సపోర్ట్ అందిస్తున్నారు.

శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో  రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి  హిరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా థర్టీ ఫెలో.‌ ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని జి. యస్. బాబు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఈ మధ్యనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమాలోని సందేవేల పాటను ప్రముఖ దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యింది.

ఎంతో మెలోడీగా సాగే ఈ సాంగ్ ని సాయి రాజేష్ రిలీజ్ చేసి ఈ చిత్రానికి తన సపోర్టుని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతిచంద్ర మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ సాంగ్ విడుదల చేసిన అనంతరం దర్శకుడు  సాయిరాజేష్ మాట్లాడుతూ: ‘నా మిత్రుడు శాంతిచంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిమ్ సభ్యులందరికీ నా అభినందనలు,’ అని చెప్పుకొచ్చారు.

అనంతరం ఈ సినిమా హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ: ‘మా డర్టీఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ ను దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేసి మా టిమ్ ని అభినందించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సాంగ్ సాయిరాజేష్ గారికి బాగా నచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామ అని తెలియజేశారు.

ఈ సినిమాలో శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, కుమరన్, జయశ్రీ, ఎఫ్ ఎమ్ బాబాయ్, సురేంద్ర తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

Read More: Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో అరుదైన గౌర‌వం.. భార‌త దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్క‌డు..

Read More: Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News