Balakrishna vs Chiranjeevi: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..సంక్రాంతి పోటీ ఇక లేనట్టే.. ఎందుకంటే?

Balakrishna - Chiranjeevi Fight may Not Happen : 2023 సంక్రాంతికి బాలకృష్ణ-చిరంజీవి సినిమాలు పోటీ పడతాయని ముందు నుంచీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 17, 2022, 03:02 PM IST
Balakrishna vs Chiranjeevi: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..సంక్రాంతి పోటీ ఇక లేనట్టే.. ఎందుకంటే?

Balakrishna - Chiranjeevi Fight may Not Happen: నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ ఇప్పటిది కాదు. నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు తరం తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉండేది. వెంకటేష్, నాగార్జున కూడా మంచి పోటీ ఇచ్చినా ప్రధాన పోటీ మాత్రం బాలకృష్ణ-చిరంజీవి మధ్యే ఉండేది. వారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తమ హీరోని పొగుడుతూ మరో హీరోని టార్గెట్ చేస్తూ ఉండేవారు.

చివరిసారిగా వీరిద్దరూ సంక్రాంతి సీజన్లో పోటీ పడ్డారు. 2017వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా 102 కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తే బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం 50 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు మరోసారి పోటీ పడే అవకాశం ఉందనే ప్రచారం రూపొందుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ తన కెరీర్ లో 107వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి గోపీచంద్ మనల్ని డైరెక్షన్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే మరో పక్క చిరంజీవి తన 154వ నాలుగో సినిమా బాబీ డైరెక్షన్లో చేస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే బాలకృష్ణ 107వ సినిమా మెగాస్టార్ 154 సినిమాలు రెండింటిని నిర్మించేది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కాబట్టి, ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రావడం అనేది ఇప్పుడు అసాధ్యం అనే చెబుతున్నారు.

దాదాపుగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాబి డైరెక్షన్లో మెగాస్టార్ చేస్తున్న 154 సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతి సినిమా రిలీజ్ చేసే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సంక్రాంతి వరకు వేచి ఉంటే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి.

అయితే నిజానికి బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు పోటాపోటీగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేసే రిస్క్ చేయడం ఇబ్బంది, అయిన భావించి ఇద్దరు హీరోలతో మా చర్చలు జరుపుతామని టాక్. మెగాస్టార్ చిరంజీవి సినిమా అప్పటికి విడుదలకు సిద్ధమయ్యాయి. అవకాశాలు చాలా తక్కువ కాబట్టి బాలకృష్ణ సినిమానే విడుదలయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Also Read: Neha Sharma Hot Photos: రోజు రోజుకీ రెచ్చిపోతున్న నేహా శర్మ.. ఏకంగా లోదుస్తులు కనిపించేలా!

Also Read: Manchu Vishnu - Payal rajput : దీనక్కా ఇది ఊరికే మాట్లాడుతోంది.. పాయల్ పరువుతీసిన మంచు విష్ణు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News