Balakrishna - Kajal: కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన బాలయ్య..

Balakrishna - Kajal: కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన నందమూరి నట సింహం బాలకృష్ణ. టాలీవుడ్ క్వీన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందిన కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ 'సత్యభామ' ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 23, 2024, 07:10 AM IST
Balakrishna - Kajal: కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన బాలయ్య..

Balakrishna - Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 2 దశాబ్దాలు కావొస్తోంది. అంతేకాదు పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లైనా హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. తాజాగా ఈమె టైటిల్ రోల్లో 'సత్యభామ' సినిమా చేసింది. ఈ సినిమా కాజల్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీ అని చెబుతున్నారు. ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస రావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మేజర్ మూవీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. అంతేకాదు సమర్పకుడిగా వ్యవహస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను క్రైమ్ అడ్వెంచరెస్ థ్రిల్లర్‌గా రూపొందించారు.  

త్వరలో విడుదల తేదిని అనౌన్స్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను ఈ నెల 24న నందమూరి నట సింహా బాలకృష్ణ ఆవిష్కరించనున్నట్టు సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తుండంతో 'సత్యభామ' మూవీపై అంచనాలు పెరిగాయి. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి 'భగవంత్ కేసరి' మూవీలో నటించారు. కానీ ఈ సినిమాలో వీళ్లిద్దరి పై డ్యూయట్ లేకపోవడం అభిమానులను కాస్తంత నిరాశ పరిచింది. అంతేకాదు బాలయ్య నటిస్తోన్న 109 సినిమాలో కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 'సత్యభామ' మూవీలో కాజల్ అగర్వాల్‌తో పాటు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తోంది. అంతేకాదు తన ఫ్యామిలీ వ్యవహారాలను చూసుకుంటోంది. బాలయ్య విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో హాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఇపుడు అది కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో బాబీ దర్శకత్వంలో డిఫరెంట్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను బాలయ్య బర్త్ డే అయిన జూన్ 10న అనౌన్స్ చేయనున్నారు. మరి రిలీజ్ డేట్ కూడా అదే రోజు ప్రకటించనున్నారు. మరోవైపు బాలకృష్ణ ఏపీలోని హిందూపురం నుంచి మూడోసారి తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసారు. వరుసగా రెండు సార్లు గెలిచిన బాలయ్య.. తాజాగా జరిగిన ఎన్నికలతో హాట్రిక్ విజయం పై కన్నేసారు.

ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..

ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News