Bhagavanth Kesari: బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, ఎప్పుడు, ఎందులోనంటే

Bhagavanth Kesari: టాలీవుడ్ నటుడు బాలయ్య నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి అప్‌డేట్ ఇది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అప్పుడే 100 కోట్లు వసూలు చేసి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2023, 11:48 AM IST
Bhagavanth Kesari: బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, ఎప్పుడు, ఎందులోనంటే

Bhagavanth Kesari: ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు చేస్తున్న బాలయ్య మరో సెన్సేషనల్ హిట్ భగవంత్ కేసరి. దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి బాలయ్యతో చేసిన సినిమా ఇది. అఖండ తరువాత బాలయ్యకు మరో హిట్ ఇది. ఇంకా ధియేటర్లలో వసూళ్లు చేస్తున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఎప్పుడు, ఏ ఓటీటీలో అనేది తెలుసుకుందాం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ష నటించిన సినిమా భగవంత్ కేసరి మరోసారి బాక్సాఫీసు వద్ద గర్జించింది. అక్టోబర్ 19న విడుదలైన సినిమా అప్పుడే 100 కోట్లు వసూలు చేసేసింది. ఇప్పటి వరకూ బాలయ్య కన్పించిన కోణంలో కాకుండా ఈసారి అనిల్ రావిపూడి మరో కొత్త కోణంలో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే భగవంత్ కేసరి హిట్ అయింది. అయితే ఓటీటీ క్రేజ్ పెరగడంతో చాలామంది ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నెల లేదా రెండు నెలల వ్యవధిలో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. 

ప్రతి సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల పరిధి కూడా నిర్ణయమైపోతోంది. అందుకే విడుదలయ్యే ప్రతి సినిమా థియేటర్ హక్కులు, ఓటీటీ హక్కులు వేర్వేరుగా జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే భగవంత్ కేసరి సినిమాను ప్రముఖ ఓటీటీ వేదిక భారీ ధరకు దక్కించుకుంది. ఇప్పుడు స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. అధికారికంగా ప్రకటించకపోయినా నవంబర్ 23 నుంచి స్ట్రీమ్ అయ్యేందుకు భగవంత్ కేసరి సిద్ధమైందని తెలుస్తోంది. అంటే భగవంత్ కేసరి సినిమా థియేటర్‌లో మిస్సైన వారికి గుడ్‌న్యూస్. ఇంట్లో కూర్చుని బాలయ్య గర్జనలు చూడవచ్చు.

Also read: Adikeshava Release Date: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. 'ఆదికేశవ'మూవీ రిలీజ్ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News