బాలయ్య బాబుతో రొమాన్స్ చేయనున్న దీపికా పదుకునె ?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యేలా ఆ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ జాబితా రోజురోజుకు పెరుగుతూపోతోంది.

Last Updated : Apr 3, 2018, 09:47 PM IST
బాలయ్య బాబుతో రొమాన్స్ చేయనున్న దీపికా పదుకునె ?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యేలా ఆ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ జాబితా రోజురోజుకు పెరుగుతూపోతోంది. స్వర్గీయ నందమూరి తారకరామా రావు రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ఇప్పటికే బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్‌ని ఆశ్రయించినట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లో మరో ప్రధాన పాత్ర అయిన నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర కోసం తెలుగు వారికి సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ని సంప్రదించినట్టుగానూ తెలిసింది. ఇదిలావుంటే, ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆ సినిమా మేకర్స్ తాజాగా దీపికా పదుకునెతో సైతం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవడానికన్నా ముందుగా తెలుగు సినిమాకు మకుటం లేని మహారాజులా ఏలిన రోజులని చూపించే క్రమంలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించబోయే పాత్ర కోసం దీపికా పదుకునేని ఆశ్రయించినట్టు సమాచారం. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, శ్రీదేవిల జోడీ ఎంతో ప్రత్యేకమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆ జోడి మ్యాజిక్‌ని మళ్లీ తెరపై చూపించేందుకు ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అతిథి పాత్రలో కనిపించాల్సి వున్న శ్రీదేవి పాత్ర కోసం దీపికా పదుకునెకు ప్రాముఖ్యత ఇస్తున్నారు నిర్మాతలు. 

ఇటీవలే తేజ దర్శకత్వంలో  హైదరాబాద్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం బాలయ్య బాబు మొదటిసారిగా నిర్మాతగా మారారు. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటిలతో కలిసి ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తున్నారు.  

Trending News