Bandla Ganesh Praises Ravi Teja : పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టేశాడా?.. రవితేజను ఆకాశానికెత్తేస్తోన్న బండ్ల గణేష్‌

Bandla Ganesh Praises Ravi Teja బండ్ల గణేష్ తనకు నచ్చితే నెత్తిన పెట్టేసుకుంటాడు. లేదంటే పాతాళంలోకి తొక్కేసినట్టుగా మాట్లాడతాడు. తాజాగా రవితేజ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. రవితేజతో బండ్ల గణేష్ ఓ సినిమా తీసిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2023, 06:18 PM IST
  • నెట్టింట్లో బండ్ల గణేష్‌ సందడి
  • పవన్ కళ్యాణ్‌తో బండ్లన్న గొడవ?
  • రవితేజను పొగుడుతూ బండ్లన్న ట్వీట్
Bandla Ganesh Praises Ravi Teja : పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టేశాడా?.. రవితేజను ఆకాశానికెత్తేస్తోన్న బండ్ల గణేష్‌

Bandla Ganesh Praises Ravi Teja బండ్ల గణేష్ పొగిడే పొగడ్తలు, వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధిస్తూ.. ఓ భక్తుడిలా స్తుతిస్తూ చేసే ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక స్టేజ్ ఎక్కితే పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం మొదలుపెడితే.. స్టేడియం మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే. ఆడిటోరియం మొత్తం కేకలతో నిండిపోవాల్సిందే. అంతటి స్థాయిలో పవన్ కళ్యాణ్‌ను పొగిడేస్తాడు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ మాటలకు పవన్ కళ్యాణ్‌ సైతం మురిసిపోతోంటాడు. అంతలా పొగిడేస్తున్నా కూడా ముసి ముసి నవ్వులు చిందిస్తుంటాడు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్‌కు గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. బండ్ల గణేష్‌ ప్రొడ్యూసర్‌గా గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తాను అనుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్‌ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

బండ్ల గణేష్ ఎంత అనుకున్నాడో అంత ఇచ్చాడట. కానీ తాను అనుకున్నంత ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్ అన్న మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దీంతో కొంత మంది పవర్ స్టార్ అభిమానులు బండ్ల గణేష్‌ను నిలదీశారు. దీంతో బండ్లన్న కాలిపోయినట్టుంది. అంత పెద్ద షోలో మీ గురించి అలా మాట్లాడాడంటే.. మీరంటే ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతోంది అంటూ బండ్ల గణేష్‌కు సపోర్ట్‌గా ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు

 

ఆ ట్వీట్‌కు బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై అందరినీ ఆశ్చర్యపరిచింది. నా విశ్వరూపం చూపిస్తా.. అని పవన్ కళ్యాణ్‌ మీద రివేంజ్ తీసుకుంటాడా? అనే అనుమానం వచ్చేలా ట్వీట్ వేశాడు బండ్ల గణేష్. ఇప్పుడు రవితేజను పొగిడేస్తూ బండ్ల గణేష్‌ వేసిన ట్వీట్ చూస్తే.. పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటాడా? అనే సందేహం కలుగుతోంది.

కళ్ళల్లో కసి, మీసం లో పౌరుషం , ముక్కు మీద రాజసం అంటూ రవితేజను పొగుడుతూ బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నువ్ ఎంతగా పొగిడినా డేట్లు ఇవ్వడు అని కొందరు అంటే.. ఇప్పుడు రవితేజను పొగడటం పనిగా పెట్టుకున్నావా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

 

అయితే ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడిగాడు. ఏంది బండ్లన్నా.. బండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ గారి దారిలోంచి మారి .. మాస్ మహారాజా రవితేజ గారి రోడ్డులోకి మళ్లింది.. దేవరను మరిచావా? భక్తి తగ్గిందా? అని అడిగాడు. దీనికి బండ్లన్న అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. నేను హిందువుని.. శ్రీశైలం వెళ్తాను,  తిరుపతి వెళ్తాను, శబరిమల వెళ్తాను అంటూ నాకు అందరు హీరోలు ఇష్టమే.. అందరినీ కొలుస్తాను అన్నట్టుగా చెప్పేశాడు.
 

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News